AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RT68 Movie: ఎమ్మార్వో ఆఫీసర్‌గా మారనున్న మాస్‌ మహారాజా.. రామారావు లుక్‌లో అదుర్స్‌ అనిపిస్తోన్న రవితేజ.

Raviteja: మాస్‌ మహా రాజ రవితేజ సినిమాల్లో వేగాన్ని పెంచేశారు. కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తూ వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతున్నారు. 'నేల టికెట్‌', 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ', 'డిస్కో రాజా' ఇలా.. వరుస పరాజయాలతో...

RT68 Movie: ఎమ్మార్వో ఆఫీసర్‌గా మారనున్న మాస్‌ మహారాజా.. రామారావు లుక్‌లో అదుర్స్‌ అనిపిస్తోన్న రవితేజ.
Raviteja First Look
TV9 Telugu Digital Desk
| Edited By: Narender Vaitla|

Updated on: Jul 12, 2021 | 12:30 PM

Share

Raviteja: మాస్‌ మహా రాజ రవితేజ సినిమాల్లో వేగాన్ని పెంచేశారు. కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తూ వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతున్నారు. ‘నేల టికెట్‌’, ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘డిస్కో రాజా’ ఇలా.. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న సమయంలో ‘క్రాక్‌’ సినిమాతో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చారు రవితేజ. ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వరుసగా సినిమాలకు సైన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రవితేజ నటిస్తోన్న కొత్త ‘ఖిలాడి’ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమా ఇంకా చిత్రీకరణ పూర్తికాకముందే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పారు రవి. వీటిలో శరత్‌ మాధవ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి. రవితేజ 68వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధిచి ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

ఈ సినిమా పేరును ‘రామారావు’గా ప్రకటిస్తూ చిత్ర యూనిట్‌ రవితేజ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ‘ఆన్‌ డ్యూటీ’ అనే క్యాప్షన్‌తో వస్తోన్న ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌ పాత్రలో నటించనున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ రవితేజకి జంటగా నటించబోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. రవితేజ ఈ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఇప్పటి వరకు పోలీస్‌ పాత్రలో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిన రవితేజ ఇప్పుడు ఓ ప్రభుత్వ అధికారి పాత్రలో మొప్పించనున్నాడన్న మాట. మరి రవితేజ ఈ సినిమాతో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచిచూడాల్సిందే. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రవితేజ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘రామరావు ఆన్‌ డ్యూటీ’ అనే క్యాప్షన్‌ను జోడించారు.

రవితేజ ట్వీట్..

Raviteja:

Also Read: నా మెడలో తాళి ఉండగా నీ మెడలో తాళి పడనివ్వను అంటున్న దీప.. తనకు న్యాయం చేయమని జ్యోతిరెడ్డిని ఆశ్రయించిన మోనిత

Priyanka: ఆస్పత్రికి వెళ్లి చెక్‌ చేయించుకుంటే సమస్యలన్నీ బయటపడ్డాయి.. శరీరంలో వచ్చిన మార్పులపై ఓపెన్‌ అయిన ప్రియాంక.

అనుష్క, విరాట్‌ల ముద్దుల కూతురు వామికాకు 6 నెలలు.. ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేస్తూ మురిసిపోతున్న దంపతులు..