Rare Photo: బాల్యంలో చెల్లెలి మరణంతో.. డిప్రెషన్ లోకి వెళ్లి.. గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న కోలీవుడ్ స్టార్ హీరో..

Rare Photo: సామాన్యులైన, సెలబ్రెటీలైనా బంధాలకు అనుబంధాలకు విలువ ఇచ్చేవాళ్ళు ఎక్కువమంది ఉన్నారు. తమ రక్తం పంచుకుని పుట్టిన సోదరసోదరీమణులను ప్రాణంగా చూసుకునే..

Rare Photo: బాల్యంలో చెల్లెలి మరణంతో.. డిప్రెషన్ లోకి వెళ్లి.. గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న కోలీవుడ్ స్టార్ హీరో..
Rare Photo Vijay
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 12, 2021 | 12:32 PM

Rare Photo: సామాన్యులైన, సెలబ్రెటీలైనా బంధాలకు అనుబంధాలకు విలువ ఇచ్చేవాళ్ళు ఎక్కువమంది ఉన్నారు. తమ రక్తం పంచుకుని పుట్టిన సోదరసోదరీమణులను ప్రాణంగా చూసుకునే సెలబ్రెటీలు చాలామంది ఉన్నారు. తాము ఎదుగుతూ.. తమ కుటుంబ సభ్యుల ఉన్నతికి కృషి చేసినవారు ఎందరో.. తాము చిన్నతనంలో పడిన కష్టాలు తన తోడబుట్టినవారు పడకూడదు అని అనుకుంటారు.. అలాంటి సెలబ్రెటీల్లో ఒకరు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్కు. బాల్యంలో అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న విజయ్.. ఈరోజు తమిళ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేజీ లిఖించుకున్నాడు.

హీరో విజయ్ బాల్యంలో ఎదుర్కొన్న ఒక సంఘటనను విజయ్ తల్లి ఓ సందర్భంలో వెల్లడించారు. తన కొడుకు పడిన వేదనకు ఆమె కన్నీరు పెట్టారు. విజయ్ కు ఓ చెల్లెలు ఉండేదట. ఆ చిన్నారి చెల్లెలు పేరు.. విద్య, అయితే రెండేళ్ల వయసులో విద్య అనారోగ్యం బారిన పడిందట. విద్య ఆరోగ్యం కోసం చాలామంది వైద్యులను సంప్రదించారు.. ఎంత వైద్యం చేయించినా విద్య మళ్ళీ కోలుకోలేదు.. చిరు ప్రాయంలోనే కన్నుమూసింది. దీంతో రోజూ స్కూల్ నుంచి వచ్చి చెల్లెలు తో ఆడుకునే విజయ్ డీప్ షాక్ కు లోనయ్యాడట. ఎంతో ప్రేమించే చెల్లి మరణంతో విజయ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట. ఏడాది పాటు విజయ్ డిప్రెషన్ నుంచి కోలుకోలేదని విజయ్ తల్లి తెలిపారు.

ఈ టాప్ స్టార్స్ చెల్లెలు మరణంతో ఒక ఏడాది పాటు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా గడిపాడట. అయితే అప్పుడు విజయ మెల్లగా సినిమాలవైపు ఆకర్షింపబడ్డాడు.. సినిమా ప్రపంచంపై మక్కువ పెంచుకున్న విజయ్ హీరో కావాలనే కోరికతో మాములు మనిషిగా మారాడట. నిజంగా విజయ్ ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి కారణం సినిమా అంటూ విజయ్ తల్లి ఒక సందర్భంలో చెప్పారు.

ప్రస్తుతం కోలీవుడ్ లో సూపర్ రజనీకాంత్ , కమల్ హాసన్ ల హవా తగ్గిన తర్వాత వారి ప్లేస్ ను రీప్లేస్ చేసింది విజయ్ అని అంటారు. డిఫరెంట్ సినిమాలతో వరస హిట్స్ అందుకుంటూ.. బాక్సాఫీస్ వద్దసత్తా చాటుతున్నాడు విజయ్. ప్రస్తుతం బీస్ట్ అనే మూవీలో నటిస్తున్నాడు. విజయ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.

Also Read: పెట్రోల్ ధర పైపైకి .. కేవలం రోజుకి రూ.10 ఖర్చుతో బైక్‌పై రయ్యిన తిరుగుతున్న తెలంగాణ వ్యక్తి.. ఎలా అంటే