Jangaon Man: పెట్రోల్ ధర పైపైకి .. కేవలం రోజుకి రూ.10 ఖర్చుతో బైక్‌పై రయ్యిన తిరుగుతున్న తెలంగాణ వ్యక్తి.. ఎలా అంటే

Jangaon Man: రోజు రోజుకీ పెరుగుతున్న జనాభా.. పెరుగుతున్న అవసరాలు. అంతర్జాతీయంగా రోజు రోజుకీ పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు. దానికి అనుగుణంగా దేశంలో రోజు రోజుకీ చుక్కలను తాకుతున్న..

Jangaon Man: పెట్రోల్ ధర పైపైకి .. కేవలం రోజుకి రూ.10 ఖర్చుతో బైక్‌పై రయ్యిన తిరుగుతున్న తెలంగాణ వ్యక్తి.. ఎలా అంటే
Petrol Bike
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 12, 2021 | 12:05 PM

Jangaon Man: రోజు రోజుకీ పెరుగుతున్న జనాభా.. పెరుగుతున్న అవసరాలు. అంతర్జాతీయంగా రోజు రోజుకీ పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు. దానికి అనుగుణంగా దేశంలో రోజు రోజుకీ చుక్కలను తాకుతున్న పెట్రోల్ ధరలు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటినా ఎక్కడ పరుగులు ఆపడం లేదు. పెట్రోల్ ధరల పెరుగుదల ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంపై పడింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సెంచరీ మార్కుని దాటిన పెట్రోల్ ధర.. రూ. 110 లకు చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయంపై దృష్టి పెడుతున్నారు. మరికొందరు పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే తెలంగాణకు చెందిన ఈ వ్యక్తి అందరికంటే భిన్నంగా ఆలోచించాడు.. పెట్రోల్ భారం తగ్గించుకుని.. తన మోటార్ బైక్ పై రయ్యి రయ్యిమంటూ చక్కర్లు కొడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

జనగాం కి చెందిన కూరపాటి విద్యాసాగర్ పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నాడు. తన దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కు పెట్రోల్ కు బదులు ఎలక్ట్రిక్ బ్యాటరీని అమర్చాడు. దీంతో హ్యాపీగా బండిమీద తిరుగుతున్నాడు. ఇలా బైక్ కు బ్యాటరీ అమర్చడానికి కేవలం రూ. 7, 500 అయ్యిందని తెలిపారు. తన బండికి నాలుగు 30ఏహెచ్ బ్యాటరీలను అమర్చి వాటికి ఛార్జింగ్ పెట్టి తిరుగుతున్నాడు. ఇలా ఒక్కసారి బ్యాటరీలు ఫుల్ ఛార్జ్ చేస్తే.. తన బైక్ దాదాపు 50కిలీమీటర్ల మైలేజి ఇస్తుందని విద్యాసాగర్ చెప్పాడు. అంతేకాదు బ్యాటరీ ఛార్జ్ చేయడానికి కూడా విద్యుత్ ఎక్కువ ఖర్చుకాదని.. ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఒక్క యూనిట్ మాత్రమే ఖర్చు అంటుందని అంటున్నాడు విద్యాసాగర్.

తనకు అంతకు ముందు బండి మీద తిరగడానికి రోజుకు రూ. 200 ఖర్చు అయ్యేదని.. ఇప్పుడు కేవలం పది రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని అంటున్నాడు. తన బ్యాటరీ ద్విచక్రవాహనంపై చక్కర్లు కొడుతున్నాడు.

Also Read: జపాన్ లో భారీ వర్షాలు, వరదలు .. విరిగిపడిన కొండచరియలు 27మంది గల్లంతు..వారికోసం గాలింపు