AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas-Unstoppable 2: ప్రభాస్ ప్రోమో వచ్చేసింది.. డార్లింగ్ నిజంగా అన్‌స్టాపబుల్.. ఏమన్నా ఉందా సీన్..

డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ అన్ స్టాపబుల్ ప్రోమో వచ్చేసింది. తన బెస్ట్ ఫ్రెండ్ గోపిచంద్ తో కలిసి బాలయ్యతో బాహుబలి చేసిన అల్లరి వేరేలేవల్ అసలు..

Prabhas-Unstoppable 2: ప్రభాస్ ప్రోమో వచ్చేసింది.. డార్లింగ్ నిజంగా అన్‌స్టాపబుల్.. ఏమన్నా ఉందా సీన్..
Unstoppable 2 Prabhas And Gopichand Promo
Rajitha Chanti
|

Updated on: Dec 17, 2022 | 7:56 PM

Share

డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రోమో వచ్చేసింది. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అతని ప్రాణ స్నేహితుడు గోపిచంద్‏తో కలిసి సందడి చేశారు. డార్లింగ్ ను బాలయ్యతో కలిసి గోపిచంద్ ఓ ఆటాడుకున్నారు. అంతేకాదు.. చాలా కాలం తర్వాత బాహుబలి ఎంత సరదాగా నవ్వుతూ కనిపించారు. అలాగే ఈ వేదికపై ఎన్నో విషయాలను పంచుకున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభాస్.. గోపిచంద్ తో బాలయ్య అల్లరి అదిరిపోయింది.

అందులో ప్రభాస్ ను ఓ రేంజ్ లో టీజ్ చేశారు గోపిచంద్. డార్లింగ్‏కు సంబంధించిన పర్సనల్ విషయాలను బయటపెట్టేందుకు గోపిచంద్ ప్రయత్నిస్తుండగా.. ఆపేందుకు ప్రభాస్ ట్రై చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే.. డార్లింగ్ కు సంబంధించిన ఓ సీక్రెట్ రివీల్ చేసేందుకు గోపిచంద్ ట్రై చేయగా.. ఓరెయ్ అంటూ ఆపే ప్రయత్నం చేశారు ప్రభాస్. ఇక ఆ తర్వాత గోపిచంద్ మీదకు ఏదో విసరడానికి ప్రయత్నిస్తుండగా.. బాలయ్య గోపిచంద్ కు అడ్డుగా నిలబడ్డారు.

తాజాగా విడుదలైన ప్రోమోలో..బాలయ్య రిక్వెస్ట్ తో డార్లింగ్ సర్ అని పిలిచారు ప్రభాస్. సల్మాన్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అని చెప్పుకొచ్చారు. నీ లైఫ్ లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏంటీ అని అడగ్గా.. డార్లింగ్ రియాక్షన్ అదిరిపోయింది. ఆ తర్వాత డార్లింగ్ గురించి రామ్ చరణ్ కొన్ని సీక్రెట్స్ చెప్పేందుకు ట్రై చేస్తుండగా.. ఓరేయ్ చరణ్.. నువ్వు నా ఫ్రెండ్ ఆ .. శత్రువు వా అంటూ సరదాగా అడిగారు. చరణ్ లీక్ చేసిన న్యూస్.. రాణి గురించే కదా అంటూ అసలు విషయం బయటపెట్టాడు గోపిచంద్. దీంతో గోపిచంద్ ను కొట్టేందుకు ప్రభాస్ ట్రై చేయగా..బాలయ్య అడ్డు నిలిచాడు. అలాగే మరోసారి బుజ్జిగాడు సినిమాలోని ఫేమస్ డైలాగ్ చెప్పి అలరించాడు డార్లింగ్. చివరగా తన పెద్దనాన్న కృష్ణంరాజును తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు ప్రభాస్. ఈ పూర్తి ఎపిసోడ్ డిసెంబర్ 30న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.