AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: ‘ఆదిత్య 369’ సీక్వెల్ పై బాలకృష్ణ రియాక్షన్.. హీరోగా ఎవరు కనిపించనున్నారంటే..

నందమూరి బాలకృష్ణ కెరీర్‏లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఆదిత్య 369. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీ సీక్వెల్ పై కొన్నాళ్లుగా చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే.

Balakrishna: 'ఆదిత్య 369' సీక్వెల్ పై బాలకృష్ణ రియాక్షన్.. హీరోగా ఎవరు కనిపించనున్నారంటే..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: Dec 04, 2024 | 4:14 PM

Share

నందమూరి బాలకృష్ణ నటించిన ఐకానిక్ చిత్రాల్లో ఆదిత్య 369 ఒకటి. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా 1991లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో థియేటర్లలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఇది ఒకటి. ఈ చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతారు. ఈ మూవీలో బాలకృష్ణ, మోహిని, సిల్క్ స్మిత, శుభలేఖ సుధాకర్, గొల్లపూడి మారుతిరావు, చంద్రమోహన్ వంటి ప్రముఖులు కీలకపాత్రలు పోషించగా.. హీరో తరుణ్ బాలనటుడిగా కనిపించారు. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఆదిత్య 369 సీక్వెల్ పై బాలకృష్ణ కీలకవ్యాఖ్యలు చేశారు. ఆయన హోస్టింగ్ చేస్తోన్న అన్ స్టాపబుల్ సీజన్ 4 కార్యక్రమంలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. “ఆదిత్య 369కు సీక్వెల్ గా ఆదిత్య 999 రానుంది. మా అబ్బాయి మోక్షజ్ఞ తేజ హీరోగా యాక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది” అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 6న స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో ఆదిత్య 369 సినిమాకు సంబంధించిన గెటప్ లో కనిపించారు బాలయ్య. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. టైమ్ మిషన్, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఆదిత్య 369 చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు 110 రోజులు శ్రమించి ఈ సినిమాను పూర్తి చేశారు. అప్పట్లోనే ఈ చిత్రానికి రూ. కోటిన్నర వరకూ ఖర్చు అయినట్లు సమాచారం. 1991 జూలై 18న ఆదిత్య 369 విడుదలైంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే బాలకృష్ణ తన కొత్త సినిమా డాకు మహారాజ్ షూటింగ్ పనులు కంప్లీట్ చేశారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్