AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధ్బుతమైన కంటెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘ఆహా’.. “అర్ధశతాబ్ధం” సినిమా వరల్డ్ ప్రీమియర్‌ను ఎనౌన్స్ చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ

ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' నుంచి ఇప్పటికే అనే వెబ్ సిరీస్ లు , సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా త్వరలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.  'అర్ధ శతాబ్దం' సినిమా మార్చి 26 నుంచి స్ట్రీమ్ కానుంది.

అధ్బుతమైన కంటెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'ఆహా'.. అర్ధశతాబ్ధం సినిమా వరల్డ్ ప్రీమియర్‌ను ఎనౌన్స్ చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ
Rajeev Rayala
| Edited By: Rajitha Chanti|

Updated on: Mar 11, 2021 | 6:47 AM

Share

Telugu OTT platform Aha : ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ నుంచి ఇప్పటికే అనే వెబ్ సిరీస్ లు , సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా త్వరలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.  ‘అర్ధ శతాబ్దం’ సినిమా మార్చి 26 నుంచి స్ట్రీమ్ కానుంది. మార్చిలో మహా ఎంటర్‌టైన్మెంట్‌కు రెడీ అవుతోంది 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా. ఈ సందర్భం అర్ధశతాబ్దం సినిమా మార్చి 26 నుంచి ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమ్ కానుందన్న విషయాన్ని వెల్లడించారు మేకర్స్‌. జాతీ, మత, వర్ణ వివక్ష కు వ్యతిరేకంగా పోరాటం ప్రేమ కోసం జరిగే పోరాటమే ఈ సినిమా కథ. వైలెన్స్‌ దాని వల్ల జరిగిన ఇతర పరిణామాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపిస్తున్నారు. 2003 లో జరిగిన కథగా ఈ సినిమాను రూపొందించారు. కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్‌, కృష్ణ ప్రియ, సుహాస్‌, పవిత్ర లోకేష్‌, అజయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా “అర్ద శతాబ్ధం” సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌ గ్లింప్స్‌తో సినిమా మీద మంచి బజ్‌ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే మాస్ మహారాజ ‘క్రాక్‌’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ‘ఆహా’ త్వరలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించిన  ‘నాంది’ లాంటి మరో హిట్ సినిమాను స్ట్రీమ్ చేసేందుకు రెడీ అవుతోంది. సూపర్ ఓవర్‌ లాంటి ఒరజినల్‌తో సక్సెస్ సాధించిన ఆహా.. ఇప్పుడు అర్ధ శతాబ్దంతో పాటు రానా హోస్ట్ చేస్తున్న నంబర్ 1 యారి షోనుని కూడా  స్ట్రీమ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇలా బిగ్ ప్రాజెక్ట్స్ తో తెలుగు వారికి మరింత చేరువవుతోంది ఆహా. సూపర్‌ స్టార్స్‌ నటించిన సినిమాలతో పాటు క్లాసిక్స్‌తో ప్రేక్షకులకు అద్భుతమైన కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది ‘ఆహా’.

మరిన్ని ఇక్కడ చదవండి :

Dethadi Harika : తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్ నేను .. క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Ram Pothineni : హ్యాట్రిక్ హిట్ కోసం సిద్దమవుతున్న యంగ్ హీరో.. కథ విషయంలో తగ్గేదే లేదంటున్న రామ్..