Allari Naresh Naandhi : అల్లరి నరేష్ నట విశ్వరూపం నాంది.. త్వరలో డిజిటల్ లో ప్రసారం..
రోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఆర్ధిక, వాణిజ్య రంగాలతో పాటు అనేక చలన చిత్ర పరిశ్రమ కూడా నష్టపోయింది. ఇక లాక్ డౌన్ సమయంలో అప్పటికే...
Allari Naresh Naandhi : కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఆర్ధిక, వాణిజ్య రంగాలతో పాటు అనేక చలన చిత్ర పరిశ్రమ కూడా నష్టపోయింది. ఇక లాక్ డౌన్ సమయంలో అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్య వంటి వారితోపాటు.. చిన్న సినిమాలు కూడా ఓటీటీ ద్వారా రిలీజ్ చేశారు.
ఇక ప్రముఖ డిజిటల్ సంస్థలు కూడా పలు సినిమాలను కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అల్లరి నరేష్ సూపర్ హిట్ మూవీ నాంది కూడా డిజిటల్ లో రావడానికి రెడీ అవుతుంది.
‘నా ప్రాణం పోయిన పర్వాలేదు.. న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి’’ అంటూ అల్లరి నరేష్ చేసిన నటనకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నరేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన చిత్రం నాంది ప్రేక్షకులనే కాదు విమర్శకులను సైతం మెప్పించింది. ఈ సినిమా మార్చి 12వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఆహా లో ప్రసారం కానున్నది.
సినిమా రిలీజైన మూడు వారాల తరువాత ఆహాలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఈ ట్రైలర్ సాగింది.
నాంది మూవీలో అల్లరి నరేష్ నటనతోపాటు సినిమాకు కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నే పద్యంలో డిజిటల్ లో కూడా నాంది మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. నాంది కోసం ఆహా మంచి ధర చెల్లించినట్లు తెలుస్తోంది. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మించారు
Also Read: