Maha Shivaratri Celebrations : ఏపీలోని ప్రముఖ పంచారామ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి.. వాటి విశిష్టత ..తెలుసుకుందాం..!

భోళాశంకరుడు శివయ్య అనుగ్రహం పొందడానికి చేసే పండుగల్లో అతిముఖ్యమైంది శివరాత్రి. ఈ పండువ రోజున శైవక్షేత్రాల దర్శనం అత్యుత్తమం. ఇక ఏపీలో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరుపొందాయి. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని.. ఆ 5 క్షేత్రాలే పంచారామాలని ఓ పురాణం కథనం.. ఆ క్షేత్రాలు వాటి విశిష్టత శివరాత్రి సందర్భంగా తెలుసుకుందాం..!

Surya Kala

|

Updated on: Mar 10, 2021 | 2:27 PM

దక్షప్రజాపతి యజ్ఞం చేసిన ప్రాంతం ద్రాక్షారామం. తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడిందని పురాణం కథనం.. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ. 892-922 మధ్య నిర్మిచినట్లు శిలాశానాల ద్వారా తెలుస్తోంది.   ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. శివాలయంతో పాటు విష్ణాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం ద్రాక్షారామం. ఈ క్షేత్రంలోని శివ లింగంభీమేశ్వర లింగంగా ప్రసిద్ధి. లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండో అంతస్తులో  ఉంటుంది. రెండో అంతస్తులోని లింగానికి అభిషేకాదులు నిర్వహిస్తారు.

1 / 5
అమరలింగేశ్వర స్వామి పుణ్య క్షేత్రం ఇక్కడ కృష్ణానదీ తీరాన ఉంది. ఏపీలోని పంచారామాలలో ఇది ఒకటి. త్రిపురాసుర సంహారసమయంలో కుమారస్వామిచేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాల కథనం.పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొనబడింది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి. అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది.

2 / 5
పశ్చిమ గోదావరి భీమవరం వద్ద గునిపూడిలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం సోమారామం. ఇక్కడ శివుడు సోమేశ్వర జనార్దన స్వామిగా భక్తులతో పూజలను అందుకుంటున్నారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించినట్లు శిలాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలోని శివలింగం సాధారణ రోజుల్లో తెలుపు నలుపు రంగుల్లో ఉంటుంది. ఇక అమావస్య నాడు మాత్రం గోధుము వర్ణంలో మారుతుంది.  మళ్ళీ పున్నమినాటికి యధారూపంలోకి వస్తుంది. అందుకనే ఈ క్షేత్రానికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణా దేవి రెండో అంతస్తులోనూ ఉండి పూజలను అందుకుంటున్నారు.

3 / 5
 పంచారామ క్షేత్రాల్లో ఒకరైన కుమారారామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు. ఈ ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేల మధ్య ఉంటుంది. ఇక్కడ లింగం తెల్లని రూపంలో 14 అడుగుల ఎత్తున రెండంతస్తుల మండపంలో ఉంది. పై అంతస్తులోని లింగానికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం. ఈ ఆలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే దక్షరామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు సాగింది. అనంతరం 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని పునర్మించారు.

4 / 5
పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై శ్రీ రామలింగేశ్వరుడుగా వెలసిన పవిత్ర క్షేత్రం. ఇక్కడ శివలింగం తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు.   శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. తొమ్మిది అంతస్తులతో 20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లు ఉన్నాయి. ఏటా ఉత్తరాయణ , దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్ద గోపురం నుంచి స్వామివారిపై పడడం విశేషం

5 / 5
Follow us