AP Municipal Elections 2021 : పోలీసులు వారించినా క్యూలో నిల్చునే ఓటుహక్కు వినియోగించుకున్న అఖిలప్రియ, పోలీసు అధికారిని తోసేసిన కొల్లు
AP Municipal Elections 2021 : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిలప్రియ ఓటేశారు. క్యూలో నిల్చోనక్కర్లేదని పోలీసులు వారించినా ఆమె వినకుండా క్యూలో ఉండే ఆమె తన ఓటుహక్కు వినియోగించుకున్నారు...
AP Municipal Elections 2021 : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి అఖిలప్రియ ఓటేశారు. క్యూలో నిల్చోనక్కర్లేదని పోలీసులు వారించినా ఆమె వినకుండా క్యూలో ఉండే ఆమె తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటేశాక పోలీసులు ఇంటిదగ్గర దించేందుకు ఒత్తిడి తీసుకురావడంపై అఖిల ఒక దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. తనను హౌస్ అరెస్ట్ చేసి ఎమ్మెల్యేకు మాత్రం సహకరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిబంధనలు అందరికీ ఒకేలా వర్తించాలని ఆమె గట్టిగా చెప్పుకొచ్చారు. క్యూలో నిల్చుని ఓటుహక్కు వినియోగించుకుంటానని చెప్పినాకాని, వద్దని పోలీసులు చెప్పడంపై ఆమె విమర్శలు గుప్పించారు అఖిలప్రియ.
ఇలా ఉండగా, కారులో ఎక్కువమందితో ప్రయాణిస్తున్నారంటూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను కృష్ణాజిల్లా మచిలీపట్టం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు రవీంద్ర. చంపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో పోలీసు అధికారిని తోసేసిన కొల్లు.. పోలీసుల తీరుకు నిరసనగా నేల మీద కూర్చొని నిరసన తెలిపారు.
Read also :