AP Municipal Elections 2021: విజయవాడ, అనంతపురం గుంటూరులో పగడ్బందీ ఏర్పాట్లు, చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్

AP Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దాదాపు ప్రశాంతంగా సాగుతోంది. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటూ ఓటు వేసేందుకు తరలివస్తున్నారు

AP Municipal Elections 2021: విజయవాడ, అనంతపురం గుంటూరులో పగడ్బందీ ఏర్పాట్లు, చెదురుమదురు ఘటనలు మినహా  ప్రశాంతంగా పోలింగ్
Follow us
Venkata Narayana

| Edited By: Ravi Kiran

Updated on: Mar 10, 2021 | 12:34 PM

AP Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దాదాపు ప్రశాంతంగా సాగుతోంది. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటూ ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో స్వల్పంగా ఘర్షణలు చెలరేగాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సాగే ఎన్నికలో.. ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తోంది ఎన్నికల సంఘం. పగడ్బందీ ఏర్పాట్లు మధ్య పోలింగ్ కొనసాగుతోంది. మొత్తంగా 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వగా.. పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఏకగ్రీవం కాగా, మిగతా 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్‌లోకు ఎన్నికలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మున్సిపల్ పోలింగ్ సాగుతోంది. అవాంఛనీయ ఘటనలు తలెత్తితే ఎదుర్కొనేందుకు స్ట్రైకింగ్ ఫోర్స్ సిద్ధంగా ఉంచారు.

విజయవాడలో మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. తొలి మూడు గంటల వరకు 25 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైనట్టుగా విజయవాడ సీపీ శ్రీనివాస్‌రావు చెప్పారు. గత ఏడాది 63 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈసారి ఎక్కువగా అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించారు. విజయవాడ మున్సిపోల్ కార్పొరేషన్‌ మూడో వార్డులో టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని స్వేత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ శాతం పెరగకుండా వైసీపీ అడ్డుకుంటుందని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. 7,915 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా.. 2214 డివిజన్లు, వార్డుల బరిలో 7,549 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కార్పొరేషన్లలో అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 1122, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 1168గా గుర్తించారు పోలీసులు. మున్సిపాలిటీల్లో అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 1169, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 1233 ఉన్నాయి.

Read also : Visakhapatnam municipal elections : విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్