AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Pothineni : హ్యాట్రిక్ హిట్ కోసం సిద్దమవుతున్న యంగ్ హీరో.. కథ విషయంలో తగ్గేదే లేదంటున్న రామ్..

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రత్యేకమనే చెప్పాలి. చాలా కాలం ఆతర్వాత రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు.

Ram Pothineni : హ్యాట్రిక్ హిట్ కోసం సిద్దమవుతున్న యంగ్ హీరో.. కథ విషయంలో తగ్గేదే లేదంటున్న రామ్..
Rajeev Rayala
|

Updated on: Mar 10, 2021 | 11:23 PM

Share

Ram Pothineni : టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రత్యేకమనే చెప్పాలి. చాలా కాలం ఆతర్వాత రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా రామ్ కెరియర్ లో వన్ అఫ్ ధీ బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించారు. పురిమార్కు డైలాగులు రామ్ ఊర మాస్ యాక్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విజయం తర్వాత రామ్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత తిరుమల కిషోర్ దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేసాడు. ఈ మూవీలో ఈ యంగ్ హీరో డ్యూయల్ రోల్ లో అదరగొట్టాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుఉంది ఈ సినిమాకూడా మంచి విజయం సొంతం చేసుకోవడంతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశాడు రామ్.

ప్రస్తుతం తమిళ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ ప్రాజెక్ట్ ను బైలింగువల్ సినిమాగా తెలుగు తమిళంలో తెరకెక్కించనున్నారు. అయితే గత రెండు సినిమాలనుంచి రామ్ సినిమాకలక్షన్స్ పైన నిర్మాతలు దృష్టి పెట్టారు. ఇప్పుడు రాబోతున్న సినిమా విషయంలోను ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా ఇటు హీరో రామ్ అటు మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అలాగే స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు లింగుస్వామికి ఇంపుట్స్ ఇస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో రామ్ హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nikhil Siddharth: హీరో నిఖిల్ సిద్ధార్ధ్‌కు గాయాలు.. కార్తికేయ 2 షూటింగ్‌లో యాక్షన్‌ స్టంట్స్‌ చేస్తుండగా ప్రమాదం

Saranga Dariya controversy: వివాదంపై తొలిసారి స్పందించిన దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు