AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil Siddharth: హీరో నిఖిల్ సిద్ధార్ధ్‌కు గాయాలు.. కార్తికేయ 2 షూటింగ్‌లో యాక్షన్‌ స్టంట్స్‌ చేస్తుండగా ప్రమాదం

Nikhil Siddharth: టాలీవుడ్‌ యువ హీరో నిఖిల్‌ ప్రస్తుతం 'కార్తికేయ 2' సినిమాతో బిజీగా ఉన్నాడు. కార్తికేయ 2 సినిమా షూటింగ్ గుజరాత్‌లో కొనసాగుతోంది. అయితే యాక్షన్..

Nikhil Siddharth: హీరో నిఖిల్ సిద్ధార్ధ్‌కు గాయాలు.. కార్తికేయ 2 షూటింగ్‌లో యాక్షన్‌ స్టంట్స్‌ చేస్తుండగా ప్రమాదం
Subhash Goud
|

Updated on: Mar 10, 2021 | 7:54 PM

Share

Nikhil Siddharth: టాలీవుడ్‌ యువ హీరో నిఖిల్‌ ప్రస్తుతం ‘కార్తికేయ 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కార్తికేయ 2 సినిమా షూటింగ్ గుజరాత్‌లో కొనసాగుతోంది. అయితే యాక్షన్‌ స్టంట్‌ చేస్తుండగా నిఖిల్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. డూప్‌ లేకుండా యాక్షన్‌ సీక్వెన్స్‌లో చేస్తుండగా, కాలుకు గాయాలు కాగా, షూటింగ్‌ నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని రోజుల వరకు ఎలాంటి యాక్షన్‌ స్టంట్స్‌ చేయవద్దని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిఖిల్‌ నొప్పినుంచి నెమ్మదిగా కోలుకుంటున్నట్లు సినీ వర్గాల ద్వారా సమాచారం.

కాగా, సూపర్‌ హిట్‌ థ్రిల్లర్‌ కార్తికేయకు సీక్వెల్‌గా కార్తికేయ 2 మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే మరసారి చందూ మొండేటి, నిఖిల్‌ ఈ ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం గుజరాత్‌లో కొనసాగుతోంది. అందులో భాగంగా అక్కడ కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, హీరో నిఖిల్‌ ఆరోగ్యం విషయంలో అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ దాదాపు 35 ఏళ్ల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇవి చదవండి:

Actress Nadhiya : హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న అందాల అత్తమ్మ నదియా కూతుర్లు..

Saranga Dariya controversy: వివాదంపై తొలిసారి స్పందించిన దర్శకుడు శేఖర్ కమ్ములు.. ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్