AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saranga Dariya controversy: వివాదంపై తొలిసారి స్పందించిన దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు

లవ్ స్టోరీ సినిమాలోని  'సారంగ దరియా' పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. ఇప్పుడు అంతే వివాదస్పదమవుతుంది. అసలు ఈ పాట ఎవరికి చెందుతుంది అనే అంశం ఇప్పడు హాట్‌టాపిక్‌గా మారింది.

Saranga Dariya controversy: వివాదంపై తొలిసారి స్పందించిన దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు
సారంగ దరియా వివాదంపై శేఖర్ కమ్ముల క్లారిటీ
Ram Naramaneni
| Edited By: Rajeev Rayala|

Updated on: Mar 10, 2021 | 10:31 PM

Share

లవ్ స్టోరీ సినిమాలోని  ‘సారంగ దరియా’ పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. ఇప్పుడు అంతే వివాదస్పదమవుతుంది. అసలు ఈ పాట ఎవరికి చెందుతుంది అనే అంశం ఇప్పడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇది జానపదులు పాట అని.. ఎప్పట్నుంచో జనాల్లో ఉందని.. ఇది ప్రజల పాట అని గేయ రచయిత సుద్దాల అకోక్ తేజ చెబుతున్నారు. తాజాగా ఈ వివాదంపై చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల క్లారిటీ ఇచ్చారు.

“చాలా ఏళ్ళ కిందట ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో శిరిషా అనే అమ్మాయి ‘సారంగ దరియా’ అనే పాట పాడింది. ఆ పాట నాకు అలా గుర్తుండి పోయింది. ఆ పాట ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది. ఈ ఫిల్మ్ విజువలైజ్ చేస్తున్నప్పుడల్లా ఈ పాట నా మైండ్‌లో తిరుగుతూనే ఉంది. నా మొదటి సినిమా ‘dollar dreams’ లో లక్కి అలి పాడిన పాట ఉంటుంది. ఆ పాటని ఫిల్మ్ లో ఉపయోగించినందకు సోని కంపెనీకి నేను కొంత మొత్తం చెల్లించాను. ఫిల్మ్‌లో క్రెడిట్ కూడా ఇచ్చా. తర్వాత తీసిన ‘ఆనంద్’ లో లక్కి అలితో పాడించుకున్నా కూడా. ఇలా ప్రతి సినిమాలో నాకు ఒక్కో పాట నా మైండ్‌లో తిరుగుతుంటుంది. లవ్ స్టోరీ సినిమా చేస్తున్నప్పుడు నా మనసులో ఈ పాట ఉంది. సుద్దాల గారిని కలిసాను. ఈ పాటని సినిమాకి అనుకూలంగా రాయాలి అంటే, సదరు పాట పల్లవి తీస్కొని, చరణాలు రాశారు. ఆ పాటకి అంత బాగా లిరిక్స్ రాసినందుకు చాలా ఆనందపడ్డా.  మా టీమ్‌లో వ్యక్తి ఒకరు శిరీష నంబర్ సంపాదించి, ఆమెని కాంటాక్ట్ చేశారు. ఆమెకి అప్పటికి డెలివరీ టైం అంటే, మేము ఇంక సరే అనుకున్నాం. కరోనా వల్ల ఫిల్మ్ ఆగి.. మళ్లీ షూట్ స్టార్ట్ అయ్యింది. చిన్న పాప ఉన్న శిరిషని ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు. ఈ పాటని నవంబర్లో షూట్ చేశాం. అది కూడా ట్రాక్ సింగర్ పాడిన వెర్షన్‌తోనే.  ఫిబ్రవరి ఆఖరులో మంగ్లీతో పాడించాం. ప్రోమో రిలీజ్ అయ్యాక సుద్దాల గారు ఫోన్ చేశారు. ‘ఇద్దరు సింగర్స్ ఆ పాట మేమే పాడాలి అంటున్నరు అని చెప్పి వారి నంబర్లు పంపారు. మా టీమ్ ఆ ఇద్దరిలో మాట్లాడారు. నేను వెంటనే సుద్దాల గారి ఇంటికి వెళ్ళాను. ఈలోగా ఆయన వివరాలు సేకరించి, ‘ఆ ఇద్దరిలో కొమలే ఆ పాటని వెలికితీసుకొచ్చింది, ఆమెతో పాడిద్దాం’ అని సుద్దాల గారు అన్నారు. నా ముందే ఆయన కోమలకి ఫోన్ చేశారు. ‘పాట రిలీజ్ చేస్తాం అని అనౌన్స్ చేశఆం కాబట్టి, కోమలని వెంటనే రమ్మని’అడిగాం. వరంగల్ నుంచి రావటానికి ఏర్పాటు చేస్తాం అన్నాం. మ్యూజిక్ డైరెక్టర్‌ను చెన్నయ్ నుంచి రప్పించాం. ‘జలుబు ఉంది, రాలేను’ అంది కోమల. పాట అనౌన్స్ చేశాం కాబట్టి మా ఇబ్బంది చెప్పాం. తనకి క్రెడిట్ ఇస్తే అభ్యంతరం లేదు అంది. ‘ క్రెడిట్‌తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది’ అని సుద్దాల గారు అన్నారు. కోమలని అడిగితే, మీ ఇష్టం సర్, ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంది. కచ్చితంగా ఇస్తాం అని చెప్పాను. ఆడియో ఫంక్షన్‌లో పాడమని, విజిబులిటీ బాగా ఉంటుంది అని, కచ్చితంగా రమ్మని నేనే కోమలకి చెప్పాను. ఆమె సరే అంది. సుద్దాల గారి ఇంటి నుంచి ఫోన్లో కొమలతో చెప్పినట్టుగానే, పాట రిలీజ్ చేసినప్పుడు  ఫేస్‌బక్‌లో కోమలకి థ్యాంక్స్ చెప్పాను. మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమలకి మేం ప్రామిస్ చేసినట్టు ఫిల్మ్ లో క్రెడిట్ ఇస్తాం, డబ్బు కూడా ఇస్తాం, ఆడియో ఫంక్షన్ ఫిక్స్ అయితే , కోమలకి పాడమని ఆహ్వానం పంపిస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడి నేను టివీల్లో జరుగుతున్న చర్చలు ఫాలో కాలేదు. ఒకేసారి ఫేస్‌బుక్‌లో అందరికి సమాచారం ఇస్తున్నాను” అని పేర్కొన్నారు శేఖర్ కమ్ముల.

ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ సడెన్‌గా మెరిసిన లగడపాటి రాజగోపాల్.. ప్రజల నాడి ఎలా ఉందని అడిగితే..?

లావుగా ఉన్నావని.. సన్నబడాలని భర్త వేధింపులు.. వివాహిత ఆత్మహత్య