Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Nadhiya : హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న అందాల అత్తమ్మ నదియా కూతుర్లు..

ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి ప్రముఖ అందాల అత్తమ్మ నదియా.. నిజానికి నటించింది చాలా తక్కువ సినిమాల్లోనే .. హీరోయిన్ గా ఎక్కువుగా తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తే.. ఇక తెలుగులో రెండు సినిమాల్లో...

Actress Nadhiya : హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న అందాల అత్తమ్మ నదియా కూతుర్లు..
Follow us
Surya Kala

|

Updated on: Mar 10, 2021 | 6:38 PM

Actress Nadhiya : ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి ప్రముఖ అందాల అత్తమ్మ నదియా.. నిజానికి నటించింది చాలా తక్కువ సినిమాల్లోనే  .. హీరోయిన్ గా ఎక్కువుగా తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తే.. ఇక తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. అయితే రాశి కంటే వాసి ముఖ్యమని నదియా విషయంలో రుజువైంది. తక్కువ సినిమాలోనైనా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

నదియా అసలు పేరు జరీనా.. ముంబై లోని ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి.. అక్కడే ప్రాథమిక, మాధ్యమిక విద్యను పూర్తిచేసింది. నదియా 1984 లో మలయాళ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టింది. ఆసినిమాలో మోహన్ లాల్ హీరో. 1985లో వచ్చిన పూవ్ పూచుదవ సినిమాతో కోలీవుడ్ లో అడుగు పెట్టింది. స్టార్ హీరోలందరితోను నటించిన నదియా హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నసమయంలోనే 1988లో బిజినెస్ మ్యాన్ శిరీష్ గాడ్ బోల్‌ను వివాహం చేసుకున్నారు. అనంతరం నదియా శిరీష్ దంపతులు అమెరికన్ లోనే సెటిల్ అయ్యారు. ఈ దంపతులకు 1996 లో ఆడపిల్ల పుట్టింది. ఆమె పేరు సనమ్.. అనంతరం మళ్ళీ ఐదేళ్ల తర్వాత రెండో అమ్మాయి జానా కు జన్మనిచ్చింది నదియా.. ఇద్దరు కూతుళ్లు తల్లి అయినా ఇప్పటికీ నదియా అందంకు కుర్రకారు ఫిదా.

మళ్ళీ 2004లో నదియా తమిళ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో 2013 లో ప్రభాస్ అమ్మగా మిర్చి సినిమాతో పునః ప్రవేశం చేసింది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కు మేనత్తగా నటించింది. ఇక అ.. ఆ , దృశ్యం వంటి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నది నదియా.. అంతేకాదు.. టాలీవుడ్ లో వరస హిట్స్ సినిమాల్లో నటించిన నదియా గోల్డ్ లెగ్ అనే నమ్మకాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం భారీ పారితోషకాన్ని అందుకుంటుంది నదియా.. అయితే ప్రస్తుతం నదియా తన ఇద్దరు కూతుర్లతో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సనమ్ , జనాలు హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో చూపరులను ఆకట్టుకుంటున్నారు.

Also Read:

Japan Women Rin Kambe : ఆరడుగుల జుట్టే తనకు భావ వ్యక్తీకరణకు బలమైన ఆయుధం అంటున్న ఓ మహిళ

ఈ 20 పాస్‌వర్డ్స్‌ను మీరు ఉపయోగించినట్లయితే .. మీ బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీయే.. తస్మాత్‌ జాగ్రత్త