AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Password: ఈ 20 పాస్‌వర్డ్స్‌ను మీరు ఉపయోగించినట్లయితే .. మీ బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీయే.. తస్మాత్‌ జాగ్రత్త

Password: ఏదైనా అకౌంట్‌ క్రియేట్‌ చేసే ముందు పాస్‌వర్డ్‌ తప్పనిసరి. బ్యాంక్‌ అయినా, ఇమెయిల్‌ అయినా, ఇతర లావాదేవీలకు సంబంధించిన వాటికి పాస్‌వర్డ్‌ పెడుతుంటాం. ..

Password: ఈ 20 పాస్‌వర్డ్స్‌ను మీరు ఉపయోగించినట్లయితే .. మీ బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీయే.. తస్మాత్‌ జాగ్రత్త
Subhash Goud
|

Updated on: Mar 10, 2021 | 6:13 PM

Share

Password: ఏదైనా అకౌంట్‌ క్రియేట్‌ చేసే ముందు పాస్‌వర్డ్‌ తప్పనిసరి. బ్యాంక్‌ అయినా, ఇమెయిల్‌ అయినా, ఇతర లావాదేవీలకు సంబంధించిన వాటికి పాస్‌వర్డ్‌ పెడుతుంటాం. అయితే పాస్‌వర్డ్‌ స్ట్రాంగ్‌గా ఉంటే ఉంటే అకౌంట్‌కు భద్రత ఎక్కువ. కానీ ఉపయోగించిన పాస్‌వర్డ్‌లనే మళ్లీ ఉపయోగించడం అనేది చాలా మందికి ఉన్న అలవాటు. సులభంగా గుర్తించుకోవచ్చనే ఉద్దేశంతో వరుస అంకెలు, ఫోన్‌ నెంబర్లు, పుట్టిన తేదీ, వాహనం నెంబర్‌ ఇలా రకరకాలుగా సులభంగా గుర్తించుకునే పాస్‌వర్డ్స్‌ను పెట్టుకుంటారు. ఇలాంటి పాస్‌వర్డ్స్‌ వల్ల ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటివి పెట్టుకుంటే హ్యాకర్లు మీ అకౌంట్‌ను ఖాళీ చేయడం ఖాయమంటున్నారు.

అయితే సులువుగా ఉండే పాస్‌వర్డ్స్‌ని పెట్టుకునేవారినే హ్యాకర్లు ఈజీగా టార్గెట్‌ చేస్తున్నారని అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి. అందుకే స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్స్‌ సెట్‌ చేసుకోవాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2020 సంవత్సరంలో కామన్‌గా ఉపయోగించిన 20 పాస్‌వర్డ్స్‌ జాబితాను ఇటీవల విడుదలైంది. డార్క్‌ వెబ్‌లో ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్స్‌ ఈ జాబితాను రూపొందించి టెక్‌ నిపుణులు విడుదల చేస్తూ ఉంటారు. ఇందులో ఎక్కువగా సులువుగా గుర్తించుకోగలిగినవే. ఇందుకే ఇలాంటి పాస్‌వర్డ్స్‌ ఉపయోగించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్స్‌ను నిపుణులు గురించి వాటిని విడుదల చేశారు. మీరు ఇలాంటి పాస్‌వర్డ్స్‌ కనుకు పెట్టుకున్నట్లయితే వెంటనే మార్చేయండి. లేకపోతే సమస్యల్లో చిక్కుకుంటారు. ఎందుకంటే ఈ కాలంలో సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోయాయి. మనకు తెలియకుండా అకౌంట్‌ నుంచి డబ్బుల దోచేస్తున్నారు. ఇలాంటి కేసులు దేశంలోనే కాకుండా హైదరాబాద్‌లో కూడా చాలా కేసులు నమోదై ఉన్నాయి. అందుకే సైబర్‌ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

చాలా మంది ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్స్‌ :

123456, password, 1234567890, 12345678, 12341234, 1asdasdasdasd, Qwerty123 Password1, 123456789, Password123, 1234567, 123123, 12345678secret, Abc123, 123123123, 111111, stratfor, lemonfish, sunshine, 1100, 2222 ఇలా వరుసగా వచ్చే అంకెలు, సులభంగా గుర్తించుకునే పాస్‌వర్డ్స్‌ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. సో.. ఇలాంటి పాస్‌వర్డ్స్‌ను ఉపయోగించకుండా కాస్త డిఫరెంట్‌గా పెట్టుకుంటే సురక్షితమని సూచిస్తున్నారు.

ఇవి చదవండి :

Decompose: భూమిలో కలిసిపోయేందుకు ఏ వస్తువుకు ఎంత కాలం పడుతుందో తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..!

OTP: బ్యాంకు లావాదేవీలు, ఈ-కామర్స్‌, ఆధార్‌ వెరిఫికేషన్ తదితర‌ ఓటీపీలు రావడం లేదా..? కారణం ఇదేనట..!

Google Maps: గూగుల్ మ్యాప్‌తో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..