Google Maps: గూగుల్ మ్యాప్‌తో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు.. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి..
Google Maps: మీ కుటుంబ సభ్యులు ఇంటికి క్షేమంగా చేరారా? మీ పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వచ్చారా? మీ స్నేహితులు ఎక్కడ ఉన్నారు? ఇలా మనకు ముఖ్యమైన వారు ఎక్కడ ఉన్నారనేది గూగుల్ మ్యాప్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
1 / 6
గూగుల్ మ్యాప్‌లో కుడి వైపున పైన ఉన్న ‘లోకేషన్ షేరింగ్’ను సెలెక్ట్ చేసుకోవాలి.
2 / 6
గూగుల్ మ్యాప్ షేరింగ్ సెలెక్ట్ చేసిన తరువాత కాంటాక్ట్స్ కనిపిస్తాయి. వాటిల్లో మనం ఎవరికైతే లోకేషన్ షేర్ చేయాలనుకుంటున్నామో ఆ కాంటాక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.
3 / 6
అవతలి నుంచి ఎవరైతే మీతో లోకేషన్ షేర్ చేసుకుంటున్నారో వారి ఫ్రొఫైల్ కనిపిస్తుంది. ఇరువురూ లొకేషన్ షేరింగ్‌ను యాక్సెప్ట్ చేశాక లోకేషన్ ట్రాక్ చేయవచ్చు.
4 / 6
ఇక్కడ మరో విశయం ఏంటంటే.. ఒక వ్యక్తి మీతో వారి లోకేషన్‌ను షేర్ చేసుకున్నారంటే.. ప్రతిసారి వారు ఎక్కడున్నారో తెలుసుకోవాలని కాదు. అందుకే వారు సురక్షితంగా గమ్య స్థానానికి చేరుకున్న తరువాత మీరు వారి కాంటాక్ట్‌ని హైడ్ చేయవచ్చు.
5 / 6
గూగుల్ మ్యాప్‌లో ఒకరి ప్రొఫైల్‌ను హైడ్ చేయాలంటే.. ముందుగా ‘లొకేషన్ షేరింగ్’కు ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తరువాత సంబంధిత కాంటాక్ట్‌ని సెలెక్ట్ చేసుకుని గూగుల్ మ్యాప్‌లో హైడ్ చేసుకోవచ్చు.