AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Decompose: భూమిలో కలిసిపోయేందుకు ఏ వస్తువుకు ఎంత కాలం పడుతుందో తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..!

Decompose: ఈ సృష్టిలో మనం జీవించేందుకు అవకాశం ఉన్న ఏకైక గ్రహం భూమి. అలాంటి భూమిని మనం చెడిపేస్తున్నాయి. ఈ భూమిలో ఎన్నో వ్యవర్థాలను వేస్తూ మానవళికి ప్రమాదకరంగా

Decompose: భూమిలో కలిసిపోయేందుకు ఏ వస్తువుకు ఎంత కాలం పడుతుందో తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..!
Subhash Goud
|

Updated on: Mar 10, 2021 | 4:57 PM

Share

Decompose: ఈ సృష్టిలో మనం జీవించేందుకు అవకాశం ఉన్న ఏకైక గ్రహం భూమి. అలాంటి భూమిని మనం చెడిపేస్తున్నాయి. ఈ భూమిలో ఎన్నో వ్యవర్థాలను వేస్తూ మానవళికి ప్రమాదకరంగా మారేలా చేస్తున్నాము. చెత్తా ప్లాస్టిక్‌ అంతా డ్రైనేజీ, సముద్రాలు, చెరువులు, నదులు, ఇలా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు ఉండిపోతున్నాయి. ఫలితంగా జంతువులు, పక్షులు, జలచరాలు, కీటకాలు అన్ని చనిపోతున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం సింగిల్‌ యాజ్‌ ప్లాస్టిక్‌ను వాడవద్దని సూచిస్తోంది. మనం రోజువారీ వాడి పారేసిన వస్తువులు, భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలిస్తే మన ఎంత పొరపాటు చేస్తున్నామో అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ప్లాస్టిక్‌ వ్యవర్థాలను భూమిపై పడేయడంతో అవి భూమిలో కరిగిపోకుండా ఎంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. మనకు మనమే తర్వాత ఆ వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్‌ బిన్స్‌లోనే వేసి రీసైక్లింగ్‌ అయ్యేలా చేసి భూమిని కాపాడుకుందాం. అయితే ప్లాస్టిక్‌కు సంబంధించిన పలు రకాలను భూమిలో వేయడం వల్ల అవి కరిగిపోవడానికి ఎంత కాలం పడుతుందో ఏ సారి చూద్దాం.

భూమిలో కలిసిపోయేందుకు ఏ వస్తువు ఎంత కాలం..

ప్లాస్టిక్ బ్యాగ్ – 500-1000 ఏళ్లు మిల్క్ ప్యాకెట్ (టెట్రా) కవర్ – 5 ఏళ్లు గ్లాస్ బాటిల్ – 10-20 లక్షల ఏళ్లు ప్లాస్టిక్ కప్స్ – 50 ఏళ్లు మిల్క్ కార్టన్ – 5 ఏళ్లు అల్యూమినియం క్యాన్ – 80-200 ఏళ్లు సన్నటి ప్లాస్టిక్ బ్యాగ్స్ – 10-20 ఏళ్లు యాపిల్ తొక్కు – 2 నెలలు జిప్ ఉండే బ్యాగ్స్ – 500-1000 ఏళ్లు క్రిస్ప్ ప్యాకెట్లు – 450-1000 ఏళ్లు సెరియల్ బాక్స్ – 6 వారాలు ప్లాస్టిక్ స్ట్రా – 200 ఏళ్లు ప్లైవుడ్ – 1-3 ఏళ్లు జ్యూస్ కార్టన్ – 300 ఏళ్లు కాఫీ కప్పు – 30 ఏళ్లు చిన్న టెట్రా ప్యాక్ – 5 ఏళ్లు కర్ట్లరీ పీస్ – 450 ఏళ్లు

రోజువారీగా వాడే వస్తువులు :

టూత్ బ్రష్ – 400 ఏళ్లు పెన్ – 450 ఏళ్లు టిన్ క్యాన్స్ – 50 ఏళ్లు ప్లాస్టిక్ బాటిల్ – 100 ఏళ్లు కార్పెట్ – 30-40 ఏళ్లు బ్యాటరీస్ – 100 ఏళ్లు లంబర్ – 10-15 ఏళ్లు టిన్ క్యాన్ – 50 ఏళ్లు పెయింట్ వేసిన బోర్డ్ – 13 ఏళ్లు కార్డ్ బోర్డ్ – 2 నెలలు పేపర్ టవల్ – 2-4 వారాలు పిల్లల డైపర్లు – 500-800 ఏళ్లు న్యూస్ పేపర్ – 6 వారాలు కారు టైర్లు – 50 ఏళ్లు

ఇతర వస్తువులు :

ట్రైన్ టికెట్ – 2 వారాలు గ్లాస్ – నిర్ధారించలేదు. సిగరెట్ ఫిల్టర్ – 5 ఏళ్లు సిగరెట్ – 1-12 ఏళ్లు పెయింట్ వేసిన చెక్క కర్ర – 13 ఏళ్లు ఫిషింగ్ లైన్ – 600 ఏళ్లు

లెదర్‌ షూస్‌ – 25-40 ఏళ్లు తాడు – 3-4 నెలలు కాటన్ బట్టలు – 1-5 నెలలు నైలాన్ బట్టలు – 30-40 ఏళ్లు శానిటరీ ప్యాడ్స్ – 500-800 ఏళ్లు ఉన్ని బట్టలు – 1-5 ఏళ్లు కాటన్ గ్లోవ్స్ – 1 – 5 నెలలు రబ్బర్ బూట్ సోల్ – 50-80 ఏళ్లు హెయిర్ స్ప్రే బాటిల్ – 200-500 ఏళ్లు డిస్పోజబుల్ డైపర్స్ – 250-500 ఏళ్లు లెదర్ బ్యాగ్, వాలెట్ – 50 ఏళ్లు

ఇవి చదవండి :

Jio Broadband: జియో బంపర్‌ ఆఫర్‌.. చిన్న వ్యాపారులకు అతి తక్కువ ధరకే జియో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

Onions Buffer Stock: సామాన్యులకు గుడ్‌న్యూస్‌: ఇక ఉల్లి ధర పెరగదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

NASA Stunning Picture: అంతరిక్షంలో అందమైన పాలపుంత.. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన నాసా..