Onions Buffer Stock: సామాన్యులకు గుడ్‌న్యూస్‌: ఇక ఉల్లి ధర పెరగదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Onions Buffer Stock: ఉల్లిధర పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారింది. ఒకవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరల మోతతో ఇబ్బందులు పడుతున్న సామాన్య జనాలకు.. ఉల్లి ధర ...

Onions Buffer Stock: సామాన్యులకు గుడ్‌న్యూస్‌: ఇక ఉల్లి ధర పెరగదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
onion
Follow us
Subhash Goud

|

Updated on: Mar 10, 2021 | 3:31 PM

Onions Buffer Stock: ఉల్లిధర పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారింది. ఒకవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరల మోతతో ఇబ్బందులు పడుతున్న సామాన్య జనాలకు.. ఉల్లి ధర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లిపాయ ధరతో ఈ ఏడాది దేశంలోని వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 2 లక్షల టన్నుల బఫర్‌ స్టాక్‌ ఉల్లిపాయను సృష్టించబోతోంది. తద్వారా వర్షాకాలంలో, ఆఫ్‌ సీజన్‌లో ఉల్లి సరఫరాకు భంగం కలుగకుండా, అలాగే ధరను అదుపులో ఉంచేందుకు కేంద్రం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ ఉల్లిపాయలో రికార్డ్‌ బఫర్‌ స్టాక్‌ను సృష్టించే ఉద్దేశం రైతులకు మంచి ధరలను అందించడంతో పాటు వినియోగదారులను జాగ్రత్తగా చూసుకోవడమేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

బఫర్‌ స్టాక్‌ ద్వారా ఉల్లి ధర అదుపులో..

అయితే ఆఫ్‌ సీజన్‌ ఉల్లిపాయలు తగినంతగా లభించడం వల్ల ధరలు అదుపులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు.. నిల్వ కూడా జాగ్రత్తగా తీసుకోబడుతుంది. తద్వారా బఫర్ స్టాక్‌లో ఉల్లిపాయ చెడిపోదు. ఇంతకు ముందు ఉల్లిపాయ ప్రభుత్వ సేకరణ మూడు రాష్ట్రాల నుంచి మాత్రమే జరిగింది. అయితే ఈ సంవత్సరం మరో నాలుగు రాష్ట్రాల నుంచి ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఏడు రాష్ట్రాల నుంచి ఉల్లి కొనుగోలు :

భారత ప్రభుత్వ నోడల్‌ సేకరణ ఏజన్సీ అయిన నేషనల్‌ అగ్రికల్చరల్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (నాఫెడ్‌) ఈ ఏడాది దక్షిణ భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు, కర్ణాటకలలో నాలుగు ప్రధాన ఉత్పాదక రాష్ట్రాల నుంచి ఉల్లిపాయలను కొనుగోలు చేయనుంది. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లతో సహా ఈ ఏడాది ఏడు రాష్ట్రాల నుంచి ఉల్లిపాయలు సేకరిస్తామని నాఫెడ్‌ మేనేజింగ్‌ డైరెక్ర్‌ సంజీవ్‌ కుమార్‌ చద్దా తెలిపారు.

2 లక్షల టన్నుల ఉల్లిపాయ బఫర్‌ స్టాక్‌:

కాగా, ఈ సంవత్సరం రెండు లక్షల టన్నుల ఉల్లిపాయల బఫర్‌స్టాక్‌ను రూపొందించే ప్రణాళిక ఉందని, ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు అని నాఫెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పేర్కొన్నారు. ఇంతకు ముందు ఉల్లిపాయను ఇంత పెద్ద బఫర్‌ స్టాక్‌ చేయలేదని అన్నారు. గత ఏడాది ప్రభుత్వం 1 లక్ష టన్నుల ఉల్లిపాయల బఫర్‌ స్టాక్‌ను ప్లాన్‌ చేసిందని, ఈ సీజన్‌లో సుమారు 95,000 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేశారని చెప్పారు.

నాఫీడ్‌ తన నిల్వ సామర్థ్యాన్ని 50,000 టన్నుల మేర పెంచిందని, ఉత్పత్తి ప్రాంతాల్లో మాత్రమే నిల్వ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. వచ్చే నెల ఏప్రిల్‌ నుంచి ప్రభుత్వం ఉల్లిపాయ సేకరణ ప్రారంభిస్తామని అన్నారు. దేశంలోపలు ప్రాంతాల్లో ఉల్లి రిటైల్‌ ధర ప్రస్తుతం కిలోకు రూ.50 ఉంది. మండీకి ఉల్లి ఉత్పత్తుల రాక పెరుగుతున్న కొద్దీ ఉల్లి ధర తగ్గుతోందని, రాబోయే రోజుల్లో మరింత తగ్గుతుందని ఆయన తెలిపారు.

రైతులకు ప్రయోజనం :

కాగా, ఉల్లిపాయలను ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని, అందులో మధ్యవర్తులు లేరని కేంద్రప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఉల్లి కొనుగోలు చేసిన డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాకు వెళ్తుందని చెప్పారు. ఈ విధానం ద్వారా రైతులకు సరసమైన ధర లభిస్తుందని, ఇది ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి చదవండి:

Flipkart Smartphone Carnival: ప్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లు.. 20 స్మార్ట్‌ ఫోన్‌లపై రూ. 10,000 వరకు డిస్కౌంట్‌

Andhra Bank: పాత ఆంధ్రా బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. కొత్త నిబంధనలు.. గుర్తించుకోవాల్సిన విషయాలు

రూ.13 వేలు తగ్గిన బంగారం

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే