Kumbh Mela 2021: కుంభమేళాకు హరిద్వార్‌లో ఏర్పాట్లు పూర్తి.. భారీగా తరలివస్తున్న భక్తులు

Kumbh Mela 2021: కుంభమేళా-2021 కోసం హరిద్వార్‌లో సర్వం సిద్ధం చేశారు. కరోనా మార్గదర్శకాలతో కుంభమేళా జరుగుతుందని ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఇప్పటికే తెలిపింది. గురువారం..

Kumbh Mela 2021: కుంభమేళాకు హరిద్వార్‌లో ఏర్పాట్లు పూర్తి.. భారీగా తరలివస్తున్న భక్తులు
Haridwar Kumbh Mela 2021
Follow us

|

Updated on: Mar 10, 2021 | 3:04 PM

Kumbh Mela 2021: కుంభమేళా-2021 కోసం హరిద్వార్‌లో సర్వం సిద్ధం చేశారు. కరోనా మార్గదర్శకాలతో కుంభమేళా జరుగుతుందని ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఇప్పటికే తెలిపింది. గురువారం శివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర గంగానదిలో మొదటి షాహి స్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు, సాధువులు తరలిరానున్నారు. ఇప్పటికే వేలాది మంది సాధువులు హరిద్వార్‌ చేరుకున్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హరిద్వార్‌, పౌరి గర్హ్వాల్‌, డెహ్రాడూన్‌ జిల్లాల పరిధిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కుంభమేళా అధికారి దీపక్‌ రావత్‌ మంగళవారం వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. దీంతోపాటు పలుచోట్ల శానిటైజర్స్‌ స్టాల్స్‌ కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కుంభమేళా సందర్భంగా భద్రత కోసం ఘాట్ల వెంట, రహదారులపై భద్రతా సిబ్బందిని మోహరించామని.. పరిశుభ్రత కోసం స్వచ్ఛంద కార్యకర్తలను నియమించామని తెలిపారు.

కాగా.. కుంభమేళాలో పాల్గొనే భక్తులు ముందుగా వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోనే వారికి ఈ-పాస్‌లు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుంభమేళాలో పాల్గొనేవారంతా అడ్మినిస్ట్రేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని.. దీంతోపాటు 72 గంటల ముందు తీసుకున్న కరోనావైరస్ నెగెటివ్‌ రిపోర్ట్‌ సహా ఐడెంటిటీ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఆ తర్వాతే ఈ-పాస్‌‌ను జారీ చేయనున్నట్లు వెల్లడించారు. కుంభమేళాలో పాల్గొనే యాత్రికులంతా ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చేవారంతా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించిన మేరకు మార్గదర్శకాలను తప్పని సరిగా పాటించాల్సి ఉంటుందని.. ఒకవేళ పాటించకపోతే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ కుంభ‌మేళా ప్రతి ప‌న్నేండు ఏళ్లకు ఒక‌సారి జరుగుతుంది. ఈ మహాకుంభ్ జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రారంభమై.. ఏప్రిల్ 27 చైత్ర పూర్ణిమ వరకు కొనసాగనుంది. గంగా నది ఒడ్డునున్న హరిద్వార్ నగరంతోపాటు అలహాబాద్, ఉజ్జయిని, నాసిక్‌లో కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించడం వలన మోక్షం లభిస్తుందని, వ్యాధులు, పాపల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల అపార విశ్వాసం. ఈ కుంభంలో ప్రధానంగా 4 షాహిస్నాన్ ఘాట్‌లు, 6 ప్రధాన స్నాన్ ఘాట్‌లుంటాయి. దానిలో భాగంగా భక్తులు గంగా నదిలో రేపు మొదటిగా పవిత్ర స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకోనున్నారు.

Also Read:

Maha Shivaratri Celebrations : ఏపీలోని ప్రముఖ పంచారామ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి.. వాటి విశిష్టత ..తెలుసుకుందాం..!

Airavatesvara Temple : సైన్స్ కు అందని అద్భుతం ఈ ఆలయం.. మెట్లను తాకితే చాలు సప్తస్వరాలే పలుకుతాయి

పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!