AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivaratri Special : లయకారుడు శివుడు అభిషేక ప్రియుడు.. ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏయే ఫలితాలను ఇస్తాడో తెలుసా..!

శివుడు అభిషేక ప్రియుడు.. హరహర మహాదేవ అంటూ మనసారా స్మరిస్తూ.. జలంతో అభిషేకించిన భక్తునకు వశమయ్యి.. కోరిన కోర్కెలను తీర్చే భోళాశంకరుడు. స్మశానమే తన నిలయం అంటూ.. నాగులే తనకు అలంకరమని చెప్పే...

Shivaratri Special : లయకారుడు శివుడు అభిషేక ప్రియుడు.. ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏయే ఫలితాలను ఇస్తాడో తెలుసా..!
Surya Kala
|

Updated on: Mar 10, 2021 | 4:47 PM

Share

Shivaratri Special :  శివుడు అభిషేక ప్రియుడు.. హరహర మహాదేవ అంటూ మనసారా స్మరిస్తూ.. జలంతో అభిషేకించిన భక్తునకు వశమయ్యి.. కోరిన కోర్కెలను తీర్చే భోళాశంకరుడు. స్మశానమే తన నిలయం అంటూ.. నాగులే తనకు అలంకరమని చెప్పే జంగమయ్యను మనస్ఫూర్తిగా కొలిస్తే అద్భుతఫలితాలు ఇచ్చే భక్తవశంకరుడు.ఈ లయకారునికి వివిధ ద్రవ్యములతో అభిషేకం చేస్తారు. అయితే ఏ ద్రవ్యాలతో శివయ్యను కొలిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం..!

1. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 2. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. 3. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 4. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 5. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలము. 6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 7. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రం నుంచి విముక్తి లభించును. 8. మెత్తని చక్కరతో అభిషేకించిన దుఃఖం నుంచి విముక్తి కలుతుంది. 9. మారేడు ( బిల్వ పత్రం) దళంతో కూడిన జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. 10. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుతుంది 11. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. 12. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిస్తుంది 13. భస్మాభిషేకంచే మహా పాపాలు నశిస్తుంది 14. గంథోదకము చేత అభిషేకించిన మంచి సంతాన ప్రాప్తి కలుగును. 15. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు దోషం తొలుగుతుంది. 16. నీటితో అభిషేకించిన పోగొట్టుకున్నవి తిరిగి లభిస్తుంది. 17. ద్రాక్ష రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభిస్తుంది. 18. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది. 19. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును. 20. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిత్వం లభించును. 21. నవరత్నోదకంతో అభిషేకం.. ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును. 22. మామిడి పండ్ల రసంతో అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును. 23. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును – శుభ కార్యములు జరుగుతాయి. 24. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు – పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు – ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).

Also Read:

 కుంభమేళాకు హరిద్వార్‌లో ఏర్పాట్లు పూర్తి.. భారీగా తరలివస్తున్న భక్తులు

ఏపీలోని ప్రముఖ పంచారామ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి.. వాటి విశిష్టత ..తెలుసుకుందాం..!