NASA Stunning Picture: అంతరిక్షంలో అందమైన పాలపుంత.. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన నాసా..

NASA Stunning Picture: అధ్బుతాలకు నెలవు అంతరిక్షం. గుర్తించాలే గానీ లెక్కలేనన్ని విశేషాలు వెలుగు చూస్తాయి. తాజాగా నేషనల్ ఏరోనాటిక్స్..

NASA Stunning Picture: అంతరిక్షంలో అందమైన పాలపుంత.. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన నాసా..
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 08, 2021 | 6:37 PM

NASA Stunning Picture: అధ్బుతాలకు నెలవు అంతరిక్షం. గుర్తించాలే గానీ లెక్కలేనన్ని విశేషాలు వెలుగు చూస్తాయి. తాజాగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) అంతరిక్షానికి సంబంధించి అద్భుతమైన ఫోటోను ఒకదానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 100 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అతిపెద్ద, అందమైన గెలాక్సీకి(NGC 2336) సంబంధించిన ఫోటోను నెటిజన్లతో పంచుకుంది. నీలి వర్ణంలో కాంతులీనుతున్న ఆ పాలపుంతలో తెల తెల్లగా మిణుకు మిణుకుమంటూ నక్షత్రాలు మెరుస్తున్నాయి. చిమ్మ చీకటికి తోడు.. నీలి కాంతి ప్రసరిస్తుండటంతో ఆ పాలపుంత చూడటానికి అద్భుతంగా కనిపిస్తోంది. ఇక ఆ పాలపుంత మధ్యలో సూర్యుని వలే అతిపెద్ద నక్షత్రం ఎర్రగా భగభగలాడుతూ సదరు గెలాక్సీలో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అద్భుతమైన చిత్రాన్ని నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసింది.

కాగా, జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త విల్హెల్మ్ టెంపెల్ 1876 లోనే NGC 2336 ని కనిపెట్టారు. కామెలోపార్డాలిస్ ఉత్తర రాశిలో ఉన్న ఈ గెలాక్సీ దాదాపు 2,00,000 కాంతి సంవత్సరాలలో విస్తరించి ఉంది. ఈ పాలపుంతను టెంపెల్ 11 అంగుళాల టెలిస్కోప్‌ను ఉపయోగించి కనిపెట్టడం విశేషం. మళ్లీ 111 సంవత్సరాల తరువాత ఈ గెలాక్సీ ఫోటోలను బంధించారు. కాగా, ఇది సూపర్ నోవా అని, గెలాక్సీల్లో కెల్లా అతిపెద్దిగా నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇక, హబుల్ టెలిస్కోప్‌ను టెంపెల్‌ టెలిస్కోప్‌తో పోల్చి చూస్తే పరిమాణంలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. హుబుల్ టెలీస్కోప్ దాదాపు10 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇక దీని మెయిన్ గ్లాస్ 7.9 అడుగుల పరిమాణంలో ఉంటుంది. హబుల్ టెలిస్కోప్ ఏప్రిల్ 1990 లో ప్రారంభించారు. అప్పటి నుండి దీని సహాయంతో గ్రహాలు, ఉల్కలు, సూపర్‌ నోవాలు, గెలాక్సీలు, ఇతర ఖగోళ వస్తువులు, అంతరిక్షంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు సంబంధించి అద్భుతమైన ఫోటోలను తీస్తున్నారు. ఈ చిత్రాలు ఖగోళ శాస్త్రవేత్తలకు విశ్వం పుట్టుకున అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తున్నాయి.

NASA Posted Galaxy NGC 2336 Picture:

Also read:

Gold features : ధరలు తగ్గుతున్నాయి.. బంగారం కొనేందుకు ఇది సరైన సమయమేనా? కొన్నాళ్లు ఆగితే బెటరా?

Incredible video shows: గగుర్పాటుకు గురిచేసిన వీడియో.. గాలానికి చిక్కిన చేపను మొసలి ఏం చేసిందో తెలుసా..