AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung: శామ్‌సంగ్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ వచ్చేసింది.. నీటిలో పడినా ఏం కాదు తెలుసా..?

Samsung galaxy xcover 5 smartphone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం.. శాంసంగ్ మరో అద్భుతమైన రగ్గడ్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 5. మిలటరీ గ్రేడ్ స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ అత్యాధునిక..

Samsung: శామ్‌సంగ్ నుంచి మరో అద్భుతమైన ఫోన్ వచ్చేసింది.. నీటిలో పడినా ఏం కాదు తెలుసా..?
Shaik Madar Saheb
|

Updated on: Mar 08, 2021 | 5:31 PM

Share

Samsung galaxy xcover 5 smartphone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం.. శాంసంగ్ మరో అద్భుతమైన రగ్గడ్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 5. మిలటరీ గ్రేడ్ స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. 2017లో వచ్చిన గెలాక్సీ ఎక్స్‌కవర్ 4కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రస్తుతానికి యూరోప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను 329 యూరోలుగా అంటే భారత కరెన్సీలో సుమారు రూ.33,300 నిర్ణయించారు. మార్చి 12 నుంచి అక్కడ ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి. త్వరలోనే ఈ ఫోన్ భారత మార్కెట్‌లోకి కూడా లాంచ్ అవుతుందని పేర్కొంటున్నారు. నాలుగేళ్ల తర్వాత ఎక్స్‌కోవర్‌ను లాంచ్ చేయడంతో స్మార్ట్ ఫోన్ ఫ్యాన్స్ చూపు మొత్తం ఈ రగ్గడ్ స్మార్ట్ ఫోన్‌పై పడింది. ఇది ఒకే కలర్ అంటే.. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులోకి రానుంది. అయితే సంస్థ అంతర్జాతీయ అమ్మకాల వివరాలు, లభ్యతను పంచుకోలేదు.

శామ్సంగ్ గెలాక్సీ ఎక్స్‌కోవర్ 5.. ఫీచర్లు.. శామ్సంగ్ గెలాక్సీ ఎక్స్‌కోవర్ 5 ఆండ్రాయిడ్ 11 వెర్షన్.. 5.3-అంగుళాల హెచ్‌డి + టిఎఫ్‌టి డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. దీనిలో ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 SoCతో.. 4GB ర్యామ్, 64GB డేటా సామర్థ్యంతో వస్తుంది. బ్యాక్ కెమెరా 16 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఎఫ్ / 1.8 లెన్స్‌తో ఉంటుంది. గెలాక్సీ ఎక్స్‌కోవర్ 5 ఫ్రంట్ కెమెరా.. 5 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ఎఫ్ / 2.2 లెన్స్‌తో వస్తుంది. 3,000 ఇన్‌బిల్ట్ బ్యాటరీ, సీటైప్ ఛార్జర్, ఫేస్ రికగ్నేషన్ సెన్సార్ కూడా దీనికి అందుబాటులో ఉంది. అయితే ఈ గెలాక్సీ ఎక్స్‌కోవర్ 5 స్మార్ట్ ఫోన్ నీటిలో పడినా ఏం కాదని శామ్‌సంగ్ తెలిపింది.

Also Read:

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!