- Telugu News Photo Gallery Technology photos Whatsapp may stop working on these smartphones full details for check the list of phones
WhatsApp: వాట్సప్ యూజర్స్ బీ అలర్ట్.. ఇకపై ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ పనిచేయకపోవచ్చు.. పూర్తి సమాచారం మీకోసం..
WhatsApp: కొన్ని పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లతో ఉన్న ఫోన్‌లలో తమ సేవలను త్వరలోనే నిలిపివేస్తామని వాట్సప్ ప్రకటించింది. దాంతో కొందరు ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిచిపోయే ఛాన్స్ ఉంది. మరి ఏ ఏ ఫోన్లలో వాట్సప్ నిలిపోనుంది? వాట్సా్ప్‌ని కొనసాగించడం ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Mar 08, 2021 | 5:03 PM

అధికారిక సమాచారం ప్రకారం.. కొన్ని పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వాట్సప్ నిలిచిపోనుందని తెలుస్తోంది.

కొన్ని ఆపిల్ ఐ ఫోన్లలోనూ దీని ఎఫెక్ట్ పడనుంది. ఆపిల్ పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వాట్సప్ త్వరలో పని చేయడం మానేస్తుంది. ఐఓఎస్ 9, పాత ఆపరేటింగ్ సిస్టమ్స్‌లతో కూడిన ఐఫోన్లలో వాట్సాప్ ఇకమీదట పనిచేయదని నిపుణులు చెబుతున్నారు.

ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కూడిన స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.

వాట్సప్ తీసుకున్న తాజా నిర్ణయంతో లైనక్స్ పాత ఆపరేటింగ్ సిస్టమ్స్‌లోనూ ఇది పని చేయదు. కేఈఐఓఎస్ 2.5.1, లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వాట్సప్‌కు మాత్రమే ఇది సపోర్ట్ ఇవ్వనుంది.

వాట్సప్ ఎలా ఉపయోగించాలి?.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏ సమస్య లేకుండా వాట్సప్ ఉపయోగించడానికి యూజర్లు మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం. ఆపిల్ ఐఫోన్‌లో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు సెట్టింగులకు వెళ్లి సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.





























