AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVS APACHE RTR 200 4V : బైక్ ప్రియులు రైడింగ్‌కి సిద్ధంకండి.. వచ్చేసింది సరికొత్త అపాచీ ఆర్‌టీఆర్‌ 200.. ధర, ఫీచర్లు ఇలా..

tvs apache rtr 200 4v : చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ అపాచీ సిరీస్‌లో ఓ కొత్త

TVS APACHE RTR 200 4V  :  బైక్ ప్రియులు రైడింగ్‌కి సిద్ధంకండి..  వచ్చేసింది సరికొత్త అపాచీ ఆర్‌టీఆర్‌ 200.. ధర, ఫీచర్లు ఇలా..
uppula Raju
|

Updated on: Mar 06, 2021 | 6:51 PM

Share

TVS APACHE RTR 200 4V : చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ అపాచీ సిరీస్‌లో ఓ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి సింగిల్ ఛానల్ ఏబిఎస్ మోడల్‌ను కంపెనీ ఇప్పుడు కొత్త రైడ్ మోడ్స్‌తో విడుదల చేసింది. కొత్త మోడ్స్‌తో ప్రవేశపెట్టిన 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ ధర రూ.1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ విభాగంలో లభిస్తున్న ఇతర మోటార్‌సైకిళ్లతో పోల్చితే, రైడ్ మోడ్ ఫీచర్‌ను తొలిసారిగా ఈ మోడల్‌లోనే అందిస్తున్నామని టీవీఎస్ పేర్కొంది.

టీవీఎస్ ఈ ఫీచర్‌ను ఇప్పటికే టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్లో ఆఫర్ చేస్తోంది. ఈ రైడింగ్ మోడ్స్‌లో స్పోర్ట్, అర్బన్ మరియు రెయిన్ అనే ఆప్షన్లు ఉంటాయి. రైడర్ తాను ప్రయాణించే రోడ్డు లేదా అవసరాన్ని బట్టి ఈ రైడ్ మోడ్‌లను ఎంచుకోవచ్చు. ఈ రైడ్ మోడ్స్‌కి అనుగుణంగా ఇంజన్ పనితీరు మారుతూ ఉంటుంది. సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్‌గా మూడు రైడింగ్ మోడ్స్‌తో వస్తున్న కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్‌లో సర్దుబాటు చేయగల ఫ్రంట్ సస్పెన్షన్, సర్దుబాటు చేయగల బ్రేక్ మరియు క్లచ్ లివర్ మరియు రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇక రైడింగ్ మోడ్స్ విషయానికి వస్తే, ఇందులోని అర్బన్ మోడ్ పేరుకు తగినట్లుగానే రోజువారీ సిటీ రైడ్‌కి అనుకూలంగా ఉంటుంది. ఇంజన్ నుండి గరిష్ట పవర్‌ను గ్రహించేలా మరియు తక్షణమే ఏబిఎస్ రెస్పాండ్ అయ్యేలా ఈ మోడ్‌ను డిజైన్ చేశారు. రెయిన్ మోడ్‌లో, స్ట్రాంగ్ లివర్ పల్సేషన్ అనుభూతిని అందించేందుకు ఇది ఏబిఎస్ నుండి గరిష్ట స్పందనను పొందుతుంది. తడిగా ఉన్న రహదారులపై మరియు వర్షంలో రైడ్ చేసేటప్పుడు ఈ మోడ్ చక్కగా ఉపయోగపడుతుంది. తడి రోడ్లపై ఏబిఎస్ రెస్పాన్స్ మెరుగ్గా ఉంటుంది, ఫలితంగా వాహనం కూడా అదుపులో ఉంటుంది.

ఇకపోతే, ఇందులో చివరి మోడ్ అయిన స్పోర్ట్ మోడ్‌ను ట్రాక్ మరియు హైవేల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడినది. ఈ మోడ్ ఇంజన్ నుండి గరిష్ట శక్తిని పొంది, వేగవంతమైన యాక్సిలరేషన్‌ను అందిస్తుంది. ఇది ఏబిఎస్ నుండి తక్కువ అసిస్టెన్స్‌ను పొంది, ల్యాప్ టైమ్‌ను వేగంగా పూర్తి చేసేందుకు స్లిప్ క్లచ్ అసిస్టెన్స్‌ను పొందుతుంది. ఈ మోటార్‌సైకిల్‌లో రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్, బ్లూటూత్ ఎనేబుల్డ్ టీవీఎస్ స్మార్ట్ఎక్స్ కనెక్ట్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ మరియు సింగిల్-ఛానల్ ఏబిఎస్ వంటి అధునాత సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ముందు వైపు 270 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 240 మిమీ డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు. ఇంజన్ విషయానికి వస్తే, టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి బైక్‌లో 197.75సిసి, సింగిల్ సిలిండర్, 4-వాల్వ్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.2 బిహెచ్‌పి పవర్‌ను మరియు 16.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Shivratri Fasting : మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా..! అయితే ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..?