- Telugu News Photo Gallery Viral photos Japanese rapunzel with 6ft 3in hair hasn t been cut for 15 years
Japan Women Rin Kambe : ఆరడుగులకు పైగా పెరిగిన జుట్టు.. 15 ఏళ్ల నుంచి నో కటింగ్
జుట్టు అంటే ఇష్టపడని అమ్మాయి ఉండరేమో.. ముఖ్యంగా భారతీయ సంప్రాయంలో అమ్మాయిల జుట్టుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది.. పొడవైన నల్లని నిగనిగలాడే కురుల కోసం అమ్మాయి పడే తాపత్రయం అంతా ఇంతాకాదు.. జుట్టు పెరుగుతుంది అంటే చాలు ఏ రకమైన ప్రోడక్ట్నైనా కొనేస్తారు.. అంతగా ఇష్టపడతారు మగువలు పొడవైన జట్టును.. అయితే తాజగా జపాన్ కు చెందిన ఓ యువత తన కంటే పొడవైన జుట్టు గురించి ఆ పొడవైన జుట్టు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
Surya Kala | Edited By: Ram Naramaneni
Updated on: Mar 10, 2021 | 8:06 PM

తన పొడవైన నల్లటి కురుల గురించి జపాన్ కు చెందిన రిన్ కంబే అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. తన జట్టును చూసి.. ఎక్కువ మంది దెయ్యం జుట్టు అని టీజ్ చేసేవారని చెప్పింది. అయితే తన జుట్టు మాత్రం తనకు చాలా గర్వకారణం అని మురిసిపోతుంది.

జపాన్ రాజధాని టోక్యోకు చెందిన రిన్ కంబే మోడల్ కమ్ డ్యాన్సర్. అయితే రిన్ కు వృత్తి పరమైన గుర్తింపు కంటే పొడవైన నల్లటి జుత్తువలన వచ్చిన గుర్తింపు ఎక్కువని .. తన శిరోజాలే తనకు మంది పేరు తెచ్చిపెట్టాయని చెబుతుంది. అందుకనే తన జుట్టును గత 15 ఏళ్ల నుంచి కట్ చేయడం లేదని తెలిపింది.

రిన్ కంబే శిరోజాల పొడవు అక్షరాలా "ఆరు అడుగుల మూడు అంగుళాలు" గత 15 ఏళ్లనుంచి కట్ చేయని తన జుట్టు ను చూసుకుంటూ మురిసిపోతుంది. అంతేకాదు తన జుట్టు తనకు భావ వ్యక్తీకరణకు బలమైన ఆయుధం అని గర్వంగా చెబుతుంది. అమ్మాయికి జుట్టు ఎంత అందాన్ని ఇస్తుందో దెయ్యం జుట్టు అని టీజ్ చేస్తున్నవారికి ఏమి తెలుసు అని ప్రశ్నిస్తుంది.

అయితే జుట్టు ఇంత ఒత్తుగా పొడవుగా నల్లగా పెరగడానికి రిన్ రోజు ఎంత కష్టపడుతుందో కూడా చెప్పింది. జుట్టు ఆరోగ్యంగా అందంగా పెరగడానికి ప్రత్యేకంగా కుంకుమ పువ్వుతో తయారు చేసిన స్కాల్స్ క్రీమ్ ను రాసుకుంటానని తెలిపింది, అంతేకాదు తినే ఆహారంలో జుట్టుకు సంబంధించిన పోషక పదార్ధాలు ఉండేలా చూసుకుంటానని.. ఐరెన్, కాలిష్యం వంటి ఉండేలా జాగ్రత్తపడతానని తెలిపింది.

35 ఏళ్ల రిన్ కంబే 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బౌద్ధమతాన్ని స్వీకరించారట.. అప్పటి నుంచి ఇక తన జుట్టును కట్ చేయడం మానేశారట. అప్పటి నుంచి జుట్టు బాగా పెరగడం గమనించిన రిన్ దానికి పోషకాలు అందేలా సంరక్షణ చర్యలు తీసుకున్నారు.. ఇప్పడు ఆమె జుట్టుకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కూడా





























