AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ సడెన్‌గా మెరిసిన లగడపాటి రాజగోపాల్.. ప్రజల నాడి ఎలా ఉందని అడిగితే..?

ఎన్నికలు ఏవైనా కావచ్చు. పోలింగ్ ముగిసిన తర్వాత.. తెలుగు రాష్ట్రాల జనమంతా ఆయన సర్వే రిపోర్ట్‌ కోసం ఎదురు చూసే వాళ్లు. బెట్టింగ్ రాయుళ్లకు ఆయన ప్రత్యక్ష దైవం.

ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ సడెన్‌గా మెరిసిన లగడపాటి రాజగోపాల్.. ప్రజల నాడి ఎలా ఉందని అడిగితే..?
లగడపాటి రాజగోపాల్
Ram Naramaneni
| Edited By: Team Veegam|

Updated on: Mar 11, 2021 | 6:49 PM

Share

ఎన్నికలు ఏవైనా కావచ్చు. పోలింగ్ ముగిసిన తర్వాత.. తెలుగు రాష్ట్రాల జనమంతా ఆయన సర్వే రిపోర్ట్‌ కోసం ఎదురు చూసే వాళ్లు. బెట్టింగ్ రాయుళ్లకు ఆయన ప్రత్యక్ష దైవం. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత.. ఏమైపోయారు. ఏపీలో లోకల్ బాడీస్ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రా అక్టోపస్ లగడపాటి ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి.

ఇంద్ర సినిమాలో చిరంజీవిలా మారిపోయారు లగడపాటి రాజగోపాల్ పరిస్థితి కూడా.  తెలుగు రాష్ట్రాలను, రాజకీయాలను వదిలేసి ఉత్తర భారతదేశంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. సమైక్య రాష్ట్ర రాజకీయాల్లో విపరీతమైన పాపులారిటీ ఉన్న నేత.. యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఎక్కడో బిజినెస్ చేసుకుంటూ టైమ్‌ గడపడం చూస్తే.. సీమ జిల్లాల్లో ఫ్యాక్షన్ వదిలేసి.. దూరంగో వెళ్లిపోయిన హీరోలు గుర్తుకు రావడంలో తప్పేముంది. ఏ పార్టీలో ఉన్నారో.. అసలు రాజకీయాల్లోనైనా ఉన్నారో లేదో తెలయదు. సినిమాలో సీమను వదిలేసి వారణాసిలో బతికిన చిరంజీవిలాగే ఉంది ఆయన వ్యవహారం కూడా. ఏపీలో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా.. ప్రజల నాడి ఎలా ఉందని అడిగితే.. నాడీ జోస్యం మానేసి చానాళ్లయిందని చెప్పారు లగడపాటి.

ఎలక్షన్ ఏదైనా సరే.. లగడపాటి అంకె చెప్పాడంటే అది పొల్లుపోదనే సెంటిమెంట్ ఉంది. అయితే 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అయ్యగారి లెక్క తప్పింది. 2019లో జరిగిన ఏపీ ఎన్నికల్లో కూడా ఆయన చేసిన సర్వే.. పూర్తిగా ట్రాక్ తప్పింది. తాను చెప్పిన అంకెల్లో తేడా వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన లగడపాటి..మాటకు కట్టుబడి రాజకీయాలకు, సర్వేలకూ కూడా దూరంగా వెళ్లారు. ఎక్కువ సమయం ఢిల్లీలోనే ఉంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడ వచ్చారు లగడపాటి. ఎన్నికల్లో ఎవరు గెలవవచ్చు అని అడిగితే.. సంక్షేమానికే ప్రజలు పెద్ద పీట వేస్తారని చెప్పారు. లగడపాటి వ్యాఖ్యల్లో ఏదైనా లాజిక్ ఉందా అని ఆలోచిస్తే.. ఎన్నికల మేజిక్ అర్థం కావచ్చు

తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని.. అవి చూసినప్పటి నుంచి మనసు లాగుతుందని చెప్పారు లగడపాటి రాజగోపాల్.. ఫర్వాలేదు.. రాజకీయ సన్యాస దీక్షలో బాగంగా… నిగ్రహంగా ఉండేందుకు చాలా కష్టాలే పడుతున్నారాయన.

Also Read: బిర్యాని ప్యాకెట్లలో బంగారపు ముక్కు పుడకలు.. అందరూ షాక్.. అసలు విషయం ఇదే…

Hyderabad Crime News: ఆటోతో ఢీకొట్టాడు.. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లమని చెబితే డ్రైవర్ కిరాతకం..

మహాశివరాత్రి వేళ మహా అద్భుతం… మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం