Gold Seize: చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. ఒకరిని అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు

Chennai Air Customs: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం భారీగా పట్టుబడింది. దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న..

Gold Seize: చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. ఒకరిని అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు
Follow us

|

Updated on: Mar 10, 2021 | 5:20 PM

Chennai Air Customs: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం భారీగా పట్టుబడింది. దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ.63.35 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెన్నై ఎయిర్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఓ వ్యక్తి ఆరు గోల్డ్ పేస్ట్ ప్యాక్‌లను సాక్సులు, నీ క్యాప్‌లల్లో దాచిపెట్టుకొని వచ్చాడు. అనుమానం కస్టమ్స్ అధికారులు ఆ వ్యక్తిని తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఆరు గోల్డ్ పేస్ట్ ప్యాక్‌లు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ పేర్కొంది.

ఇదిలాఉంటే.. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల కాలంలో భారీగా బంగారం, డ్రగ్స్ లభ్యమవుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలను పాటించకుండా భారత్‌కు బంగారం తీసుకువస్తున్నవారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు.

Also Read:

Corona: కరోనా ఉన్నా.. లేదంటూ నకిలీ సర్టిఫికెట్.. అడ్డంగా బుక్కైన ఓ ఫ్యామిలీ.. ఆ తర్వాత ఏమైందంటే..?

Hyderabad Crime News: ఆటోతో ఢీకొట్టాడు.. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లమని చెబితే డ్రైవర్ కిరాతకం..