AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool News: బిర్యాని ప్యాకెట్లలో బంగారపు ముక్కు పుడకలు.. అందరూ షాక్.. అసలు విషయం ఇదే…

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. ఓటర్లు నేతల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సులలో నిక్షిప్తం చేస్తున్నారు.

Kurnool News: బిర్యాని ప్యాకెట్లలో బంగారపు ముక్కు పుడకలు.. అందరూ షాక్.. అసలు విషయం ఇదే...
బిర్యానీ ప్యాకెట్లలో బంగారపు ముక్కు పుడకలు
Ram Naramaneni
| Edited By: Team Veegam|

Updated on: Mar 11, 2021 | 7:27 PM

Share

Andhra Pradesh Municipal Elections 2021: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. ఓటర్లు నేతల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సులలో నిక్షిప్తం చేస్తున్నారు. అయితే అభ్యర్థులు ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. కొన్నిచోట్ల తాయిలాల జోరు కొనసాగింది. నంద్యాల కర్నూలు జిల్లాలో బిర్యానీ ప్యాకెట్లలో ముక్కు పుడకలు కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. నంద్యాల 12 వార్డులో బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేయగా.. అందులో స్పెషల్ ప్యాకెట్స్‌లో బంగారపు ముక్కు పుడకలు ఉన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్‌కు వెళ్లి తనిఖీలు చేశారు. పొట్లాలు పంపిణీ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి 23 బంగారు ముక్కు పుడకలు, బిర్యానీ పొట్లాలతో పాటు రూ.55వేల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు కర్ణాటకకు చెందిన వ్యక్తులు అని తెలుస్తుంది

12 వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా  పోటీచేస్తున్న ఖండే శ్యాంసుందర్‌లాల్‌ తరపున బిర్యానీ పొట్లాలు, ముక్కు పుడకలు పంపిణీ చేసినట్లు వారు పోలీసులకు చెప్పారు. అయితే ఇక్కడ సదరు అభ్యర్థి తెలివితేటలు ప్రదర్శించారు. ఓటర్లకు గాలం వేసే క్రమంలో ఎవరికీ అనుమానం రాకుండా కర్ణాటక నుంచి కొందరు వ్యక్తులను కిరాయికి పిలిపించుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేయించాలని ప్రణాళిక రూపొందించారు. కానీ ఊహించని విధంగా సీన్ రివర్స్ అవ్వడంతో పోలీసులకు చిక్కారు. అభ్యర్థి శ్యామ్‌సుందర్‌లాల్‌తో పాటు మరో ముగ్గురిపై ఎన్నికల కోడ్ అతిక్రమణ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చూడండి ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ఎన్ని తిప్పులు పడుతున్నారో. ఓటు హక్కు ఎంతో అమూల్యమైనది. మనం నిజాయతీగా వేసే ఒక్క ఓటు జాతి మార్పుకు దోహదపడుతుంది. మన ఒక్క ఓటుతో ఏమవుతుందో అనుకోకండి. 100 మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఓటు హక్కును వినియోగించుకోండి. డబ్బు, మందు, ఇతర తాయిలాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేయండి. మెరుగైన సమాజం దిశగా అడుగులు వేయండి.

Also Read: Viral News: ఎంత చిత్రం గురూ..! 29 వేల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయట.. కోర్టుకు తెలిపిన పోలీసులు

ఇంట్లో కోలాహాలం.. మరికాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్! రీజన్ తెలిస్తే షాకవుతారు…

మహాశివరాత్రి వేళ మహా అద్భుతం… మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం