Viral News: ఎంత చిత్రం గురూ..! 29 వేల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయట.. కోర్టుకు తెలిపిన పోలీసులు

పోలీసులు అక్రమ మద్యాన్ని భారీగా స్వాధీనం చేసుకున్నారు. సుమారు 30 పోలీస్ స్టేష్టన్లో సీజ్ చేసిన మద్యాన్ని నిల్వ చేశారు. దీనికి సంబంధించి కోర్టులో కేసు విచారణ జరుగుతుంది.

Viral News:  ఎంత చిత్రం గురూ..! 29 వేల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయట.. కోర్టుకు తెలిపిన పోలీసులు
పోలీస్ స్టేషన్లో ఆ మందు ఏమైంది.. ఎలుకలు తాగాయట
Follow us

|

Updated on: Mar 09, 2021 | 9:39 PM

పోలీసులు అక్రమ మద్యాన్ని భారీగా స్వాధీనం చేసుకున్నారు. సుమారు 30 పోలీస్ స్టేష్టన్లో సీజ్ చేసిన మద్యాన్ని నిల్వ చేశారు. దీనికి సంబంధించి కోర్టులో కేసు విచారణ జరుగుతుంది. అయితే నిల్వ చేసిన మద్యం బాటిళ్లలో సుమారు 29 వేల లీటర్ల మద్యం మిస్సైయ్యింది. ఆ ఆల్కహాల్ అంతా ఏమైందని విచారణ సమయంలో న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. ఎలుకలు తాగేసినట్టున్నాయని పోలీసులు తాపీగా సమాధానం చెప్పారు.  ఏంటి ఎలకలు తాగాయా అంటూ న్యాయమూర్తితో పాటు అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏ బాటిల్‌లోనూ చుక్క కూడా మందు మిగల్చలేదు. లక్కీ డ్రాప్‌తో సహా మొత్తం తాగేశాయి. హర్యానాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. హర్యానా పోలీసులు కొద్ది నెలల క్రితం షాపులపై దాడులు చేసి దాదాపు 50 వేల లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో వివిధ లోకల్ బ్రాండ్స్‌తో పాటు ఫారెన్ మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. ఆ ఆల్కాహాల్ బాటిల్స్ అన్నింటిని 30 పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీటికి సంబంధించి 825 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. న్యాయస్థానంలో కేసు విచారణ ప్రారంభమైంది. కేసు నడుస్తుండగా.. 25 పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లలో మందు మాయమైనట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యంలో లోకల్ సారా కూడా ఉంది. పెద్ద, పెద్ద డ్రమ్ముల్లో ఆ సారా నిల్వ చేశారు. ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. ఎలుకలు లోకల్ సారా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బ్రాండెడ్ మద్యాన్ని చుక్క మిగల్చకుండా తాగేశాయి. ఇప్పుడు ఏం చేయాలి.. ఎలుకలపై పట్టుకుని సెల్‌లో‌ వేసి.. నేరారోపణ రుజువు చెయ్యాలి. అంతే కదా అంటూ నెట్టింట ఈ వార్తను తెగ సర్కులేట్ చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా పోలీసులు కోర్టుకు విషయం చెప్పేటప్పుడు కూడా ఎలాంటి తడబాటు లేకపోవడం ఆశ్యర్యపరుస్తుంది. జాగ్రత్త మీ ఇంట్లో మందు బాటిల్స్ ఉంటే ఎలుకల రాలేని ప్లేసులో పెట్టుకోండి. లేకపోతే చుక్క మిగల్చకుండా తాగేస్తాయి.

Also Read:

ఇంట్లో కోలాహాలం.. మరికాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్! రీజన్ తెలిస్తే షాకవుతారు…

స్మృతి మంధనా ఊచకోత, గోస్వామి మెరుపు బౌలింగ్.. 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన దక్షిణాఫ్రికా