Jati Ratnalu Movie: ‘జాతి రత్నాలు’ ట్విట్టర్ రివ్యూ: హిట్టు బొమ్మ.. కామెడీ అదుర్స్.. బ్లాక్‌బస్టర్ లోడింగ్.!

Jati Ratnalu Twitter Review: 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'జాతిరత్నాలు'. అనుదీప్ కేవీ...

Jati Ratnalu Movie: 'జాతి రత్నాలు' ట్విట్టర్ రివ్యూ: హిట్టు బొమ్మ.. కామెడీ అదుర్స్.. బ్లాక్‌బస్టర్ లోడింగ్.!
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 11, 2021 | 9:21 AM

Jati Ratnalu Twitter Review: ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం అందించగా.. మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్.. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఈ నిర్మించాడు. కామెడీ ఎంటర్ టైనర్‏గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‏గా తెలుగు తెరకు పరిచయమవుతోంది.

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. మహాశివరాత్రి కానుకగా ఇవాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఇప్పటికే అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షోలు ప్రారంభం కావడంతో అభిమానులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. వారి అభిప్రాయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

మొదటి షో నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఫస్టాఫ్ అదుర్స్ అని.. ఓ ఫన్ రైడర్‌ మాదిరిగా సినిమా సాగిపోతుందని అభిమానులు అంటున్నారు. ఫస్టాఫ్ బాగుందన్న ప్రేక్షకులు.. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మినహా అంతా సూపర్బ్‌గా ఉందని.. హిట్టు బొమ్మ అని క్లారిటీ ఇస్తున్నారు. ఎప్పటిలానే నవీన్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడని ప్రశంసిస్తున్నారు.

నవీన్, రాహుల్, ప్రియదర్శి మధ్య వచ్చే ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందట. అంతేకాకుండా వన్ లైన్ పంచ్‌లు అద్బుతంగా పేలాయని టాక్. హీరోగా నవీన్ పోలిశెట్టి తన ఖాతాలో మరో హిట్టును వేసుకున్నాడని అంటున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్ కూడా అద్భుతంగా జరగడంతో.. ఈ సినిమా తొలిరోజు దాదాపుగా రూ. 7 కోట్ల వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా..

జాతిరత్నాలు సినిమా ట్విట్టర్ రివ్యూస్… 

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు