Ardha Shatabdham on aha: ఈనెల 11న ‘ఆహా’లో విడుదలవుతున్న ‘అర్థశతాబ్దం’.. ఆ మూవీ స్పెషాలిటీస్ ఇవే
కొన్ని సినిమాలు చూస్తే.. మన ఊరి కథనే తెరమీద చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సగటు పల్లెటూరిలో వుండే స్వచ్ఛమైన భావాల్ని, ఆవేశాల్ని స్క్రీన్ మీద ఆవిష్కరించే....
కొన్ని సినిమాలు చూస్తే.. మన ఊరి కథనే తెరమీద చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సగటు పల్లెటూరిలో వుండే స్వచ్ఛమైన భావాల్ని, ఆవేశాల్ని స్క్రీన్ మీద ఆవిష్కరించే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. లేటెస్ట్ గా ఆహాలో స్ట్రీమింగ్ కి రెడీగా వున్న అర్థ శతాబ్దం కూడా అటువంటిదే. ఆ మూవీలో స్పెషాలిటీస్ ఏంటో చూద్దాం. యాభై ఏళ్ల స్వరాజ్యం ఎందుకు? ఎవరి కోసం.. అనే ప్రశ్నతో ఆలోచన రేకెత్తించే ప్రయత్నమే అర్థశతాబ్దం మూవీ. రూరల్ పాపులేషన్లో ఇప్పటికీ కొనసాగుతున్న అణచివేతను నిలదీసే కథతో తెరకెక్కిన అర్థ శతాబ్దం.. ఈనెల 11న ‘ఆహా’లో విడుదలవుతోంది. రీసెంట్ గా నానీ చేతుల మీదుగా రిలీజైన ట్రైలర్.. సినిమా స్ట్రెంత్ ఏమిటన్నది క్లియర్ గా చెప్పేసింది. కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీలో శుభలేఖ సుధాకర్, సాయికుమార్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. చాలా కాలం కిందటే ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది అర్థశతాబ్దం. ఇప్పుడు ఆహాలో డిజిటల్ రిలీజ్ ని కన్ఫర్మ్ చేసుకున్న సందర్భగా టీమ్ తో కలిసి డీటెయిల్స్ షేర్ చేసుకున్నారు డైరెక్టర్ రవీంద్ర పుల్లే.
కంటెంట్ అండ్ కాస్టింగ్… రెండూ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇందులో ప్రేమికుడిగా, ఆవేశపరుడిగా టూ డిఫెరెంట్ వేరియేషన్స్ తో కనిపిస్తున్నాడు కార్తీక్ రత్నం. గతంలో కేరాఫ్ కంచరపాలెంలో నటించి మెప్పించిన కార్తీక్.. బెస్ట్ పెర్ఫార్మర్ అనే పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా నారప్పలో ఛాన్స్ కొట్టేశారు. అర్థశతాబ్దం… అతడి నటనా పరిణితికి మరో మచ్చుతునక. కొత్త సినిమాలతో ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న ‘ఆహా’ మూవీ లైబ్రరీలో వెరీవెరీ స్పెషల్ ఎంట్రీ కాబోతోంది అర్థశతాబ్దం. పల్లెటూర్లలో కుల తగాదాలతో కూడిన ఎమోషన్స్ ని యాజిటీజ్ ప్రెజెంట్ చేసి.. రిలీజ్ కి ముందే క్రిటిక్స్ నుంచి మెప్పు పొందారు డైరెక్టర్ రవీంద్ర. రిలీజ్ అనంతరం ఆయన సినీ ప్రేమికులను ఎంతమేర మెప్పిస్తారో చూడాలి.
Also Read: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్రివిక్రమ్‌తో చేయనున్న మూవీ ఓపెనింగ్‌కి డేట్ ఫిక్స్!