Karthika Deepam: అన్న చేసిన తప్పుని నిలదీసిన తమ్ముడు.. దేవతను ఇంట్లోనుంచి పంపించేసి ఇంట్లో దెయ్యాలా తిరుగుదామా అంటూ..

karthika deepam serial: తెలుగు తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతుంది. ఈరోజు తో 1060 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టిన..

Karthika Deepam: అన్న చేసిన తప్పుని నిలదీసిన తమ్ముడు.. దేవతను ఇంట్లోనుంచి పంపించేసి ఇంట్లో దెయ్యాలా తిరుగుదామా అంటూ..
Karthika Deepam
Follow us
Surya Kala

|

Updated on: Jun 08, 2021 | 12:16 PM

Karthika Deepam Serial: తెలుగు తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతుంది. ఈరోజు తో 1060 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టిన కార్తీక దీపం సీరియల్ మంచి రసపట్టు సాగుతుంది. మోనిత కార్తీక్ ను ఎలాగైనా దక్కించుకోవడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుందా.. లేక దీప కార్తీక్ ను నమ్మి మోనిత వేసిన ప్లాన్ ను కనిపెడుతుందా వంటి ఆసక్తికరమైన ట్విస్ట్ లతో సాగుతుంది కార్తీకదీపం. ఈరోజు సీరియల్ లోని హైలెట్స్ ఏమిటో చూద్దాం..

అత్త సౌందర్య బాధగా దీపదగ్గర కూర్చుంటే.. దీప బాధగా కొందరిని సంతోషంగా బతకడానికి పుట్టిస్తే.. నన్ను మాత్రం బాధపడుతూ బతకడానికి పుట్టించాడు ఆ దేవుడు అని అంటుంది. చెప్పుడు మాటలను విని మీ సుపుత్రుడు నమ్మలేదు.. నన్ను అనుమానించాడు.. అవమానించాడు ఆనాడే మరణించాను.. నేను గెలిచాను.. దీప తప్పు చేయలేదు అని తెలిసింది. ఎలాగైతేనేమి నిజం తెలిసింది.. నేను గాలిచాను. ఆయన ప్రేమతో నాకు వైద్యం చేయించారని పొంగిపోయాను. కానీ అది నిజం కాదు అది కేవలం జాలి మాత్రమే అని తేలిపోయింది. ఇక ఇక్కడ నేను ఉండలేను.. నేను వెళ్లిపోతాను.అంటుంది. దీంతో సౌందర్య ఏడుస్తూ.. దీపనిఆప్ ప్రయత్నం చేస్తూ.. ఇప్పటికే ఒంట్లో ఓపిక సన్నగిల్లిందే.. ఇలాంటి మాటలు మాట్లాడిన నన్ను ఇంకా క్షోభపెట్టకే..అంటుంది. నిజంగా నామీద సానుభూతి ఉంటె నన్ను ఆప్ ప్రయత్నం చేయకండి అంటుంది.. దీప వెళ్లిపోతుంటే.. దీప అంటూ కన్నీరు పెట్టుకుంటుంది సౌందర్య.

మరోవైపు శ్రావ్య.. ఆనాడు మా అక్క తప్పు చేయలేదు.. అయినా తనే ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అన్నయ్య ఎవరూ ఊహించనంత తప్పు చేశాడు.. ఇప్పుడూ మా అక్కే వెళ్ళిపోయింది. దీనికి మీ అన్నయ్య ఏ సమాధానం చెబుతాడు అంటూ ఆదిత్యని నిలదీస్తుంది. ఇంతలో కార్తీక్ ఇంట్లోకి వచ్చి దీప కోసం వెదుకుతాడు. దీంతో ఆదిత్య వదిన లేదు ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. అంటాడు. అదేంటి ఎవరూ ఆపలేదా అంటాడు కార్తీక్ కంగారుగా… మీరు ఆపలేదా అంటే ఆగలేదు అంటాడు ఆదిత్య. ఇంకా కోలుకోలేదు.. ఎవరూ ఆపలేదా ఎలా వెళ్లనిచ్చావు మమ్మీ అంటున్న కార్తీక్ తో .. ఎలా ఆపమంటావురా. ఇక్కడ ఉంటె ఎం చూసి కోలుకుంటుంది అంటూ ప్రశ్నిస్తుంది. నువ్వు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మేమె భరించలేక పోతున్నాం.. చావునుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అది ఎలా భరించగలదు అంటుంది సౌందర్య.. దీంతో కార్తీక్ ఇప్పటికే సగం చచ్చి ఉన్నా చంపెయ్యొద్దు అంటాడు. ఆదిత్య వెంటనే అందరి పరిస్థితి అలాగే ఉంది దేవతను పంపించేసి.. దెయ్యాల తిరుగుదాం అంటాడు.

వదినని నువ్వు ఒక్కడివే అనుమానించావు. ఈ పదేళ్లలో మేము ఎవ్వరం అన్నయ్య చెబుతున్నదానిలో నిజం ఉందేమో అని కూడా అనుకోలేదు.. కానీ ఇప్పుడు నీ విషయంలో మాత్రం మోనిత చెప్పింది అబద్ధమేమో అనే ఆలోచన ఎవరికీ రావడం లేదు.. ఎందుకంటే నువ్వు మోనిత ఉండే తీరు అలా ఉంది. అది నీకు వదినకు ఉన్న తేడా.. పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను అని మోనిత చెబుతుంటే.. ఆమె మీద జాలి రాలేదు.. నీ మీద సానుభూతి రాలేదు.. ఎందుకంటే మీ ఇద్దరి ప్రవర్తన అలానే ఉండేది. నీకు ఏ సమయ వచ్చినా మోనిట ఇంటికి వెళ్లడం.. అక్కడే తినడం నిద్రపోవడం చేస్తాం.. ఇంకా మమ్మల్ని మోనిత ని పెళ్లి చేసుకుంటా అని బెదిరిస్తావు.. అంత ఎందుకు మొన్న హిమని తెస్తే.. మోనిత ని పెళ్లి చేసుకుంటా అని చెప్పావు.. ఇప్పుడు మోనిత మేడలో తాళి కట్టక పోయినా మంచి బహుమతినిచ్చావు.. అంటూ కార్తీక్ ని నిలదీస్తాడు ఆదిత్య.అంతేకాదు ఇప్పుడు మీరిద్దరూ హాయిగా ఉండండి.. వదిన ఎలా పొతే మీకెందుకు..

ఇంతలో శ్రావ్య కలుగజేసుకుని మా అక్కలాంటి భార్య ఎంతో అదృష్టం చేసుకుంటేగానీ దొరకదు బావగారు.. మీరు అంటే పిచ్చి.. వెళ్ళిపోయింది.. సెల్ఫ్ రెస్పెక్ట్ కదా అంటూ శ్రావ్య కన్నీరు పెట్టుకుంటుంది. కార్తీక్ మనసులో దీప నిరపరాధి అని తెలుసుకున్నా.. క్షమాపణ అడిగితే అపార్ధాలు తొలగి.. సంతోషంగా జీవిద్దామనుకున్నా .. కానీ ఇంతలో ఇలా అయ్యింది.. మీకు ఎలా చెప్పాలి అంటూ తనలో తానే అనుకుంటాడు. మమ్మీ అంటూ కార్తీక్ ఎదో చెప్పబోతుంటే.. ఆపి.. నువ్వు మాకేం చెప్పొద్దు కార్తీక్.. నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సింది.. నీ భార్య దీపకు.. నీ వల్ల తల్లి కాబోతున్న ఆ మోనితకి.అంటూ వెళ్ళిపోతుంది.

కార్తీక్ దేవుడి దగ్గరకు వెళ్లి.. నామీద పడింది నింద అని నేను అనను.. అలాగని నిజం అంటే కూడా నేను నమ్మలేకపోతున్నా.. దీపము ఎలా ప్రసన్నం చేసుకోవాలి.. ఎలా మాట్లాడాలి .. నాకు ధైర్యాన్ని ఇవ్వు.. ఈ గండం నుంచి గట్టెకించు అని వేడుకుంటాడు.

దీప శ్రీరామ్ నగర్ బస్తీలోనితన ఇంటి దగ్గర ఎదో ఆలోచిస్తుంటుంది. వారణాసి ఇల్లు శుభ్రం చేస్తూ ‘ఏం అయ్యింది అక్కా..ఎవరికీ చెప్పకుండా వచ్చావా.. చెబితే నిన్ను ఇక్కడికి రానివ్వరు అని అంటుంటే.. కార్తీక్ అక్కడికి వస్తాడు. మరి కార్తీక్ దీపకు ఏమని నచ్చచెబుతాడు.. తిరిగి ఇంటికి వెళ్తుందా.. రేపటి ఎపిసోడ్ లో చూడాలి మరి

Also Read: తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యాపారం.. కుందేళ్ళ పెంపకం.. ప్రభుత్వం నుంచి లోన్ కూడా

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే