Actor Abbas: ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అబ్బాస్ ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసా..
Actor Abbas: 1990 లో హీరో అబ్బాస్ అమ్మాయిల కలల హీరో.. ప్రేమ దేశం సినిమాలో అబ్బాస్ హెయిర్ స్టయిల్ కుర్రకారుకి ఓ రేంజ్ లో నచ్చేసింది. అప్పట్లో ఓ ట్రెండ్..
Actor Abbas: 1990 లో హీరో అబ్బాస్ అమ్మాయిల కలల హీరో.. ప్రేమ దేశం సినిమాలో అబ్బాస్ హెయిర్ స్టయిల్ కుర్రకారుకి ఓ రేంజ్ లో నచ్చేసింది. అప్పట్లో ఓ ట్రెండ్ సృష్టించింది. అవును అబ్బాస్ చేసింది తక్కువ సినిమాలే.. కానీ క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో సొంతం చేసుకున్నాడు.
1996 లో అబ్బాస్ పేరు దక్షిణాదిన మారుమోగిపోయింది. వినీత్ తో పాటు హీరోగా అబ్బాస్ నటించిన ప్రేమదేశం సినిమా సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అప్పట్లో ఈ సినిమా ప్రేమికులకు నచ్చిన సినిమాగా ఎన్నో సంచనాలను సృష్టించింది. స్నేహితులు మెచ్చిన సినిమాగా నేటికీ అలరిస్తోంది.
ప్రేమ దేశం సినిమాతో అబ్బాస్ కు ఫ్యాన్స్ విపరితంగా పెరిగారు. తర్వాత తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో అనేక ఆఫర్స్ అందుకున్నాడు. అయితే ప్రేమ దేశం వంటి మరో సినిమా అబ్బాస్ ఖాతాలో పడలేదని చెప్పవచ్చు. దీంతో హీరో నుంచి వెంకటేష్ , సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించిన రాజా వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు.
తమిళంలో బుల్లి తెరపై అడుగు పెట్టాడు. రెండు సీరియల్స్ లో కూడా నటించాడు. ఇక 2016 లో ఒక మలయాళం సినిమా చేసి నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పాడు.. అప్పటి నుంచి మళ్ళీ అబ్బాస్ ఏ స్క్రీన్ పై కూడా కనిపించలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో నివసిస్తున్న అబ్బాస్ ఓ వెండి తెరకు దూరంగా యువతకు దిశానిర్ధేశం చేసే వ్యాఖ్యాతగా జీవిస్తున్నారు.న్యూజిలాండ్ లో అబ్బాస్ మోటివేషనల్ స్పీకర్ గా పని చేసుకుంటూ జీవిస్తున్నారు.
Also Read: మెగానందమూరి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ కోసం నెక్స్ట్ ఇయర్ వరకూ ఎదురు చూడాలట..!
రిషీకేశ్ నుండి బదరీనాథ్ వెళ్ళేదారిలో భక్తులు సందర్శించవలసిన పంచ ప్రయాగలు (photo gallery)