Malayalam movies in OTT platforms: తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంటున్న మలయాళ సినిమాలు..

ఫిలిం ఇండస్ట్రీకి కరోనా భారీ నష్టాలనే మిగిల్చినా.. ఎంతోకొంత మంచి కూడా చేసింది. గతంలో మన థియేటర్లలో మన సినిమాలు మాత్రమే చూస్తూ వచ్చిన ఆడియన్స్..

Malayalam movies in OTT platforms: తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంటున్న మలయాళ సినిమాలు..
Malayalam Heros

ఫిలిం ఇండస్ట్రీకి కరోనా భారీ నష్టాలనే మిగిల్చినా.. ఎంతోకొంత మంచి కూడా చేసింది. గతంలో మన థియేటర్లలో మన సినిమాలు మాత్రమే చూస్తూ వచ్చిన ఆడియన్స్.. ఇప్పుడు అన్ని భాషల సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మలయాళ సినిమాలతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఏ రేంజ్‌లో అంటే మలబారు హీరోలకు టాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడేంత స్థాయిలో సందడి చేస్తున్నాయి మలయాళ సినిమాలు. మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి లెజెండరీ మలయాళ స్టార్స్‌కు దశాబ్దాలుగా తెలుగు ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆ తరువాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోలు చాలా తక్కువ. కానీ… ఇప్పుడు ఆ గ్యాప్‌ను కవర్‌ చేస్తున్నారు యంగ్ జనరేషన్ స్టార్స్‌. ముఖ్యంగా ఓటీటీ కంటెంట్‌తోనే తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్‌ లాంటి హీరోలైతే… స్ట్రయిట్ సినిమాలతోనూ తెలుగు ఆడియన్స్‌ను పలకరిస్తున్నారు.

డబ్బింగ్‌ సినిమాలతో ఓటీటీలో సూపర్‌ హిట్స్ అందుకున్న మళయాల స్టార్ ఫాహద్ ఫాజిల్‌. ‘ఆహా’ యాప్‌లో ఫాహద్ సినిమాలు ఓ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయి. ట్రాన్స్‌, అనుకోని అతిథి సినిమాలు తెలుగు ఆడియన్స్‌ను కూడా అలరించాయి. డిజిటల్‌లో ఫాహద్ ఫాలోయింగ్ చూసిన మేకర్స్… స్ట్రయిట్ సినిమాలు కూడా ఆఫర్ చేస్తున్నారు. బన్నీ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్పలో విలన్‌గా నటిస్తున్నారు ఈ మలయాళ స్టార్‌. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను ఫిదా చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ టోవినో థామస్‌. తాజాగా కాలా సినిమాతో సంచలనం సృష్టిస్తున్న టొవినో… అంతకుముందే ఫోరెన్సిక్‌, ‘లుకా అలియాస్ జానీ’ సినిమాలతోనూ ఆకట్టుకున్నారు. ఓ వైపు ఛార్మింగ్ హీరోగా రొమాంటిక్ రోల్స్‌ చేస్తూనే యాక్షన్‌ హీరోగానూ పేరు తెచ్చుకుంటున్నారు టోవినో. ఓటీటీ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌తోనూ టచ్‌లోనే ఉంటున్నారు.

మరో మలయాళ హీరో కుంచాకో బోబన్ కూడా తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు. మలయాళంలో డిఫరెంట్ మూవీస్‌తో వరుస సక్సెస్‌లు సాధిస్తున్న ఈ స్టార్.. క్రైమ్‌ థ్రిల్లర్లతో టాలీవుడ్‌ ఆడియన్స్‌కు చేరువయ్యారు. ‘ఆహా’లో స్ట్రీమ్ అవుతున్న వైరస్‌, మిడ్ నైట్‌ మర్డర్స్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఫేవరెట్ స్టార్‌గా మారిపోయారు. ఇలా వరుసగా మలయాళ స్టార్స్ తెలుగు ఆడియన్స్‌కు దగ్గరవుతుండటంతో లాంగ్వేజ్ బారియర్స్ చె చె      చెరిగిపోతున్నాయంటున్నారు క్రిటిక్స్‌.  ప్రేమమ్‌ ఫేం నివీన్ పౌలీ కూడా తెలుగు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. ప్రేమమ్‌, బెంగళూర్ డేస్ సినిమాలతో యూత్‌ ఆడియన్స్‌కు దగ్గరైన నివీన్‌.. ఇప్పుడు తన సినిమాలను మలయాళంతో పాటు తెలుగులోనూ పార్లల్‌గా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. అంతేకాదు… నివీన్ నటించిన మలయాళ సినిమాల డబ్బింగ్ వర్షన్స్‌… ఆహాలో మంచి వ్యూస్‌ సాధిస్తున్నాయి.

Also Read: ఈనెల 11న ‘ఆహా’లో విడుదలవుతున్న ‘అర్థశతాబ్దం’.. ఆ మూవీ స్పెషాలిటీస్ ఇవే

మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్రివిక్ర‌మ్‌తో చేయనున్న మూవీ ఓపెనింగ్‌కి డేట్ ఫిక్స్!