AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AR Rahmans: వ్యాక్సిన్ వేయించుకున్న ఏఆర్ రెహమాన్.. కానీ.. నెట్టింట్లో వైరల్ అవుతున్న అతని మాస్క్.. ఇంతకీ స్పెషల్ ఏంటో తెలుసా..

AR Rahman's Mask: కరోనాను ఎదుర్కోవడానికి మన దగ్గరి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్. కరోనాతో ఇప్పటికే ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

AR Rahmans: వ్యాక్సిన్ వేయించుకున్న ఏఆర్ రెహమాన్.. కానీ.. నెట్టింట్లో వైరల్ అవుతున్న అతని మాస్క్.. ఇంతకీ స్పెషల్ ఏంటో తెలుసా..
Ar Rehaman
Rajitha Chanti
|

Updated on: Jun 08, 2021 | 11:42 AM

Share

AR Rahman’s Mask: కరోనాను ఎదుర్కోవడానికి మన దగ్గరి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్. కరోనాతో ఇప్పటికే ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే ఈ వ్యా్క్సిన్ పై కొందరిలో అనేక సందేహాలు ఉన్నాయి. వాటిని తొలగిస్తూ.. ఇటీవల సెలబ్రెటీలు సైతం వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వ్యాక్సిన్ వేయించుకొని అందుకు సంబంధించిన ఫోటోలను.. వారి ఆరోగ్య పరిస్థితిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం తన తనయుడు ఏఆర్ హమీస్‏తో కలిసి సోమవారం చెన్నైలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ..తన కుమారుడితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ‘మా వంతు విధిని నిర్వర్తించాము. నేను నా కుమారుడు ఏఆర్‌ హమీన్‌ కోవీషీల్డ్‌ టీకా మొదటి డోస్‌ వేయించుకున్నాం. మీరందరూ తప్పకుండా వ్యాక్సిన్‌ వేసుకోవాలి” అని ఆయన సూచించారు.

ట్వీట్..

View this post on Instagram

A post shared by ARR (@arrahman)

ఇదిలా ఉంటే.. ఏఆర్ రెహమాన్.. అతని కుమారుడితో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్ల చూపు రెహమాన్ ధరించిన మాస్క్ పై పడింది. ఆ మాస్క్ ధర ఎంత ? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రెహమాన్ ధరించిన మాస్క్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో హైటెక్ గాడ్జెట్ వంటి. దీనికి ప్రత్యేకమైన ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. ఢిల్లీ వంటి పెద్ద పెద్ద నగరాల్లో వాయు కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి ఎయిర్ ఫ్యూరిఫైయర్ మాస్క్ ఉపయోగిస్తుంటారు. ఇది ఇళ్లలో ఉండే ఎయిర్ ఫ్యూరిఫైయర్ మాదిరిగా పనిచేస్తుంది. దీనిలో 820 mAh బ్యాటరీ ఉంది. 2 గంటలు ఛార్జీ చేస్తే.. 8 గంటల వరకు నిరంతరంగా ఉపయోగించవచ్చు. దీనిని గతేడాది చివరలో ఎల్జీ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. వైరస్లు, బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములను చంపడానికి ఇది UV-LED కాంతిని ఉపయోగిస్తుంది. కరోనా కోసం దీనిని రెడీ చేసినట్లు ఎల్జీ సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు. అంతేకాకుండా.. ఇది పీల్చుకునే గాలిని శుద్ధి చేస్తుందా.. లేదా వదిలే గాలిని శుద్ది చేస్తుందా లేదా అనేది కూడా స్పష్టంగా వెల్లడించలేదు. కరోనా సంక్రమణను నివారించడంలో మాత్రం ఇది కూడా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్లను ఒకసారి మార్చడం అవసరం. అలాగే దానిని ఎప్పుడు మార్పు చేయాలని తెలుసుకోవడానికి ఎల్జీ థిన్ క్యూ మొబైల్ ప్రాసెసర్ కు కనెక్ట్ చేయాలి. ఆ మాస్క్ ధర అమెరికా డాలర్ల ప్రకారం $249 ఉండగా.. భారతీయ కరెన్సీ ప్రకారం ఒక మాస్క్ ధర రూ. 18,000.

Also Read: Capsicum Benefits: క్యాప్సికమ్‏తో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్ ఇదే..

Health Tips: టీ తో కలిపి ఈ ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.. అవేంటంటే తెలుసా..