Health Tips: టీ తో కలిపి ఈ ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.. అవేంటంటే తెలుసా..

చాయ్..అలసిపోయిన శరీరానికి ఉత్సాహాన్నిస్తుంది. ఒక కప్పు టీ తాగితే చాలు.. అలసట తొలగిపోయి.. శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది.

Health Tips: టీ తో కలిపి ఈ ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.. అవేంటంటే తెలుసా..
Tea
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 08, 2021 | 9:54 AM

చాయ్..అలసిపోయిన శరీరానికి ఉత్సాహాన్నిస్తుంది. ఒక కప్పు టీ తాగితే చాలు.. అలసట తొలగిపోయి.. శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. ఇక టీ ప్రేమికులైతే.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ప్రతి పూట్ టీ తాగుతూనే ఉంటారు. మన దేశంలో చాయ్ ప్రేమికులు ఎక్కువగా ఉన్నారు. అయితే టీతో ఉపయోగించే వేరియంట్స్ అనేకం ఉన్నాయి. అలాగే గ్రీన్ టీ, బ్లాక్ టీ, చమోమిలే టీ, మందార టీ ఇలా లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే టీ తీసుకున్నప్పుడే దానితో పాటు ఇతర ఆహారపదార్థాలను తీసుకుంటుంటాం. కానీ కొన్ని ఫుడ్ ఐటమ్స్ మాత్రం టీతో కలిపి అస్సులు తీసుకోకూడదని చెబుతున్నారు నిపుణులు. అవెంటో తెలుసుకుందామా.

ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని టీతో కలిపి అస్సులు తీసుకోకూడదు. ఎందుకంటే.. టీలో టానిన్లు, ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి ఆహారంలోని ఐరన్ ను ఎక్కువగా గ్రహించడాన్ని నిరోధిస్తాయి. ఐరన్ ఎక్కువగా ఉండే.. గింజలు, పచ్చి ఆకు కూరలు, ధాన్యాలు, కాయధాన్యాలు, తృణధాన్యాలు టీతో కలిపి తీసుకోకూడదు.

నిమ్మకాయ టీ తాగితే బరువు తగ్గిస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే టీతోపాటు నిమ్మరసం కలిపిసే.. టీ ఆమ్లంగా తయారవుతుంది. ఫలితంగా ఉబ్బరం వస్తుంది. నిమ్మ టీ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే.. యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంటి వంటి సమస్యలు వస్తుంటాయి.

పకోడిలు, నామ్ కీన్ తో టీని కలిపి తీసుకోకూడదు. టీ తాగే సమయంలో స్నాక్స్, శనగ పిండితో చేసిన స్నాక్స్ తింటుంటారు. అయితే ఇవి కొంత మందికి మాత్రం దుష్ర్పభావాలు కలిగించవచ్చు. టీ తాగేటప్పుడు శనగ పిండితో చేసిన ఫుడ్ తినడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి. అంతేకాదు.. ఈ రెండింటిని తీసుకోవడం వలన పోషకాల సంఖ్యను గ్రహించే శరీర సామర్థ్యాన్ని కూడా తగ్గి్స్తుంది.

టీ తాగేటప్పుడు పసుపు కలిపిన పదార్థాలను తీసుకోకూడదు. ఇది గ్యాస్, అమ్లత్వం, మలబద్ధకం వంటి కడుపు సమస్యలను కలిగిస్తుంది. పసుపు, చాయ్ పొడి ఒకదానితో ఒకటి అనుకూలంగా ఉండవు. అంతేకాకుండా.. చల్లటి ఆహారాన్ని కూడా టీతో కలిపి తీసుకోకుడదు. వేర్వేరు ఉష్ణోగ్రతల ఆహారాన్ని కలిపి తీసుకోవడం వలన జీర్ణ ప్రక్రియను బలహీనపరుస్తుంది. అలాగే వికారం కూడా కలిగిస్తుంది. టీ తాగిన కనీసం 30 నిమిషాలపాటు చల్లని పదార్థాలను తినకూడదు.

Also Read: రోజూ ఈ పండ్లు, మూడు కూరగాయలు తింటే ఆయుష్షు పెరుగుతుందట.. హార్వర్డ్ అధ్యయనంలో షాకింగ్ నిజాలు..

Fake Apps: మీ ఫోన్లలో ఈ యాప్స్‌ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే మీ బ్యాంక్‌ ఖాతాలోని సొమ్ము కల్లాస్ అవడం ఖాయం..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో