- Telugu News Photo Gallery Cinema photos Actress kareena kapoor asks for whopping rs 12 crores remuneration to play sita role
Kareena Kapoor: సీత పాత్ర కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ..
సినీ పరిశ్రమలో హీరోలతో సమానంగా హీరోయిన్స్‌కు రెమ్యునరేషన్ ఇవ్వరు. లేడి ఓరియెండేట్ సినిమాలు చేసినా.. లక్కీ గర్ల్ అని పేరు వచ్చిన హీరోయిన్ రెమ్యునరేషన్ మాత్రం హీరో కంటే తక్కువగానే ఉంటుంది. అయితే కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Updated on: Jun 08, 2021 | 1:44 PM

ఇటీవల సినీ పరిశ్రమలో పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన స్టోరీలు ఎక్కువగా తెరకెక్కించేందుకు దర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో ఆదిపురుష్ సినిమా రూపొందితున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు బాలీవుడ్లో 'సీత' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామాయణ గాథ ఆధారంగా ఈ సినిమా రూపోందించనున్నారు. ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందిస్తున్నారు.

అయితే ఇందులో సీత పాత్రలో కరీనా కపూర్ నటించబోతున్నట్లుగా బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం కరీనా భారీగానే రెమ్యునరేషన్ అడిగినట్లుగా సమాచారం.

సాధారణంగా కరీనా ఒక సినిమాకు రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అయితే ఇప్పుడు సీత పాత్ర కోసం ఏకంగా రూ. 12 కోట్లు తీసుకుంటుందట.

ఈ సినిమా కోసం 8 నెలల నుంచి 10 నెలల వరకు ప్రిపరేషన్ వర్క్, షూటింగ్ ఉంటుందట. అందుకే ఇంత బారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్ నటించనున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మొదటి చిత్రం ఇది. దీనికి అలౌకిక దేశాయ్ దర్శకత్వం వహించనున్నారు.

అయితే కరీనా కపూర్ రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. కొందరు కరీనా నిర్ణయాన్ని ప్రశంస్తుండగా.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.




