Capsicum Benefits: క్యాప్సికమ్‌తో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఫుడ్ ఇదే..
Capsicum Benefits: క్యాప్సికమ్.. దీనినే డైస్ మిరపకాయ, సిమ్లా మిర్చి అని పిలుస్తుంటారు. మన భారతీయ వంటలలో క్యాప్సికమ్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
Capsicum Benefits: క్యాప్సికమ్.. దీనినే డైస్ మిరపకాయ, సిమ్లా మిర్చి అని పిలుస్తుంటారు. మన భారతీయ వంటలలో క్యాప్సికమ్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. క్యాప్సికమ్ విటమిన్ ఎ, సీ, కె, ఫైబర్, కెరోటినాయిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు లేవు. దీనివలన కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది. గ్రీన్ క్యాప్సికమ్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. క్యాప్సికమ్ గుండె ఆరోగ్యానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంకా క్యాప్సికమ్ లో ఔషధగుణగణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, క్యాప్సికమ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
క్యాప్సికమ్ ఆరోగ్య ప్రయోజనాలు.. 1. రక్తహీనత.. క్యాప్సికమ్ లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలోని ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. రక్తహీనతను కూడా నిరోధిస్తుంది. 2. బరువు తగ్గడం.. బరువు తగ్గడానికి క్యాప్సికమ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. క్యాప్సికమ్ లో ఉబకాయాన్ని కరిగించే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. 3. కళ్లకు ఆరోగ్యం.. క్యాప్సికమ్ లో లుటిన్, జియాక్సంతిన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కంటి సంరక్షణ ప్రయోజనాలకు ఇవి ఉపయోగపడతాయి. కంటి ఆరోగ్యానికి క్యాప్సికమ్ ఎక్కువగా పనిచేస్తుంది. 4. చర్మ సంరక్షణ.. క్యాప్సికమ్‌లో క్యాప్సైసిన్ అనే పోషకం ఉంటుంది. ఇది చర్మాన్ని అనేక సమస్యల నుంచి రక్షిస్తుంది. క్యాప్సికమ్ చర్మ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
5. క్యాప్సికమ్ లో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి . ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్ మరయిు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.