AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Third wave: ముంచుకొస్తున్న థర్డ్ కోవిద్ వేవ్ ముప్పు…..హిమాచల్ ప్రదేశ్ లో చిన్నారి మృతి….జాగ్రత్త పడాలంటున్న శిశు వైద్య నిపుణులు

మూడో థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో కేవలం 11 రోజుల పసికందు కోవిద్ తో మరణించాడు. 17 మంది దీని బారిన పడి మృతి చెందారు.

Covid Third wave: ముంచుకొస్తున్న థర్డ్ కోవిద్ వేవ్ ముప్పు.....హిమాచల్ ప్రదేశ్ లో చిన్నారి మృతి....జాగ్రత్త పడాలంటున్న శిశు వైద్య నిపుణులు
Covid Death
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 08, 2021 | 11:04 AM

Share

మూడో థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో కేవలం 11 రోజుల పసికందు కోవిద్ తో మరణించాడు. 17 మంది దీని బారిన పడి మృతి చెందారు. అతి చిన్న రాష్ట్రమైనప్పటికీ గత 24 గంటల్లో 656 కోవిద్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1.85,755 కేసులు నమోదైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. సిమ్లాలో ఈ పసి బాలుడు కోవిద్ తో మరణించడం..మూడో వేవ్ కి సంకేతమా అని డాక్టర్లు భయపడుతున్నారు. ఇండియాలో 2 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్కులవారికి కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చే ట్రయల్స్ పాట్నా లోను, ఢిల్లీలోని ఎయిమ్స్ లోను ప్రారంభమయ్యాయి. అయితే ఈ ట్రయల్స్ ఎంత త్వరగా పూర్తి అయి సక్సెస్ అయితే అంత మంచిదని, వారికి కూడా వ్యాక్సినేషన్ మొదలు పెట్టవచ్చునని శిశువైద్య నిపుణులు అంటున్నారు. ఇది జాప్యం జరిగేకొద్దీ ముప్పు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర కొన్ని రాష్ట్రాల్లో బాలలు కరోనా వైరస్ బారిన పడడం ఆందోళనకరమని పీడియాట్రిక్ సంఘాలు పేర్కొంటున్నాయి. మహారాష్ట్రలోని అహమద్ నగర్ జిల్లాలో సుమారు మూడు వేల మంది బాలలు కరోనా వైరస్ పాజిటివ్ కి గురయినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఫస్ట్ వేవ్ లో పెద్దలకు, సెకండ్ వేవ్ లో యువతకి కోవిద్ ముప్పు రాగా ఈ థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపవచ్చునని అంటున్నారు. ఇప్పటివరకు వీరికి సంబంధించి వ్యాక్సిన్ రాలేదన్న విషయాన్నీ వీరు గుర్తు చేస్తున్నారు. ఢిల్లీ వంటి రాష్ట్రాలు అప్పుడే పీడియాట్రిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.. బాలలకోసం ప్రత్యేక బెడ్స్ తో హాస్పిటల్ సౌకర్యాలపై దృష్టి పెట్టాయి.

పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, వారిలో కోవిద్ లక్షణాలు కల్పించినా అవి స్వల్పంగా ఉంటాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. ఏమైనా థర్డ్ వేవ్ ని నిర్లక్ష్యం చేయరాదని ఆయన సూచిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Noorjahan Mangoes: ఒక్క మామిడి పండు ధర అక్షరాలా వెయ్య రూపాయలు.. పూత దశలోనే బుకింగ్ ( వీడియో )

Actor Dhanush: టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ధనుష్… స్ట్రెయిట్ మూవీ చేయనున్న హీరో… ( వీడియో )