AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అధునాతన వెంటిలేటర్ల సృష్టిలో ఇస్రో……త్వరలో అందుబాటులోకి రానున్న మూడు రకాల ‘ప్రాణాధార యంత్రాలు’ !

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మూడు రకాల వెంటిలేటర్లను డెవలప్ చేసింది. వీటికి సంబంధించిన టెక్నాలజీని క్లినికల్ వినియోగం కోసం ఇండస్ట్రీకి బదిలీ చేయాలనీ నిర్ణయించింది.

అధునాతన వెంటిలేటర్ల సృష్టిలో ఇస్రో......త్వరలో అందుబాటులోకి రానున్న మూడు రకాల 'ప్రాణాధార యంత్రాలు' !
Isro Ventilators
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 08, 2021 | 10:47 AM

Share

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మూడు రకాల వెంటిలేటర్లను డెవలప్ చేసింది. వీటికి సంబంధించిన టెక్నాలజీని క్లినికల్ వినియోగం కోసం ఇండస్ట్రీకి బదిలీ చేయాలనీ నిర్ణయించింది. దేశం సెకండ్ కోవిద్ వేవ్ తో సతమతమవుతున్న ఈ తరుణంలో ఇస్రో తాను కూడా కోవిద్ పై పోరుకు నడుం బిగించింది. ‘ప్రాణ’, పీప్’, ‘వావో’అని ఈ వెంటిలేటర్లను వ్యవహహరిస్తున్నారు. ప్రాణ టైప్ వెంటిలేటర్ (ప్రోగ్రామబుల్ రెస్పిరేటరీ అసిస్టెన్స్ ఫర్ ది నీడీ) లో కోవిద్ రోగులకు అవసరమైన బ్రీతింగ్ యూనిట్ బ్యాగ్ ఉంటుంది. ఈ టైప్ వెంటిలేటర్ చవకైనది కూడా అని ఇస్రో వర్గాలు తెలిపాయి. దీన్నే ఆటోమేటెడ్ కంప్రెషన్ అని కూడా అంటారని, సెన్సర్, ఫ్లో సెన్సర్, ఆక్సిజన్ సెన్సర్, సర్వో యాక్యుటేటర్ వంటి వాటితో కూడిన పీప్ (పాజిటివ్ ఎండ్ ఎక్స్పిరేటరీ) అన్న ఈ టైప్ వెంటిలెటర్లో కంట్రోల్ వాల్వులు ఉంటాయని, వీటివల్ల రోగి శ్వాసలో ఏ విధమైన ఇబ్బంది ఉండదని అంటున్నారు. వెంటిలేషన్ మోడ్ ను నిపుణులు సెలెక్ట్ చేసుకుని..స్క్రీన్ పానెల్ ని టచ్ చేయడం ద్వారా పారామీటర్స్ ని అడ్జస్ట్ చేసుకుంటే ఇది రోగులకు ఎంత ఆక్సిజన్ అవసరమో అంత ఇస్తుందని వివరించారు. విద్యుత్ లేనప్పుడు ఎక్స్టెర్నల్ బ్యాటరీ బ్యాక్ డ్రాప్ కూడా ఈ సిస్టం కి ఉంటుంది. వీటిని సరిగా అమర్చకపోయినా అలారం మోగుతుందట.

వావో టైప్ వెంటిలేటర్ లో కూడా ఇలాగే అత్యంత అధునాతన సిస్టమ్స్ ఉంటాయి. సెంట్రిఫూగల్ బ్లోవర్ కారణంగా న్యూమాటిక్ సోర్స్ లేకుండా దీన్ని ఆపరేట్ చేయడం వల్ల రోగికి ఏ మాత్రం అసౌకర్యం కలగదని పేర్కొన్నారు. తిరువనంతపురం లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఈ మూడు రకాల వెంటిలేటర్లను డెవలప్ చేశారు. వీటి క్లినికల్ యూసేజ్ కి ముందు ప్రభుత్వ ఏజెన్సీల నుంచి సర్టిఫికెట్ పొందడం తప్పనిసరి.. వీటి పట్ల ఆసక్తి గల సంస్థలు ఈ నెల 15 లోగా ఇస్రోను సంప్రదించవచ్చు.

మరిన్ని ఇక్కడ చూడండి: Woman Sold in UP: రూ.80 వేలకు సొంత కోడలును అమ్మేసిన మామ.. పోలీసుల విచారణలో సంచలనాలు.. ఒకరు కాదు ఇద్దరు కాదు 300మంది!

Amazon: లోదుస్తులపై కన్నడ జెండా.. అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు… ( వీడియో )