Woman Sold in UP: రూ.80 వేలకు సొంత కోడలును అమ్మేసిన మామ.. పోలీసుల విచారణలో సంచలనాలు.. ఒకరు కాదు ఇద్దరు కాదు 300మంది!
ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై అక్రమాలు మాత్రం ఆగడంలేదు. అతివలపై అరాచకాలకు పాల్పడటమే కాకుండా వారిని అంగట్లో బొమ్మల్లా అమ్మేస్తున్నారు.
Uncle sold his own daughter-in-law: ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై అక్రమాలు మాత్రం ఆగడంలేదు. అతివలపై అరాచకాలకు పాల్పడటమే కాకుండా వారిని అంగట్లో బొమ్మల్లా అమ్మేస్తున్నారు. డబ్బుల కక్కుర్తితో ఓ మామ తన సొంత కోడలును బేరం పెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. విషయం తెలిసిన భర్త అప్రమత్తంతో పోలీసులు.. రైల్వే స్టేషన్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారబంకీ జిల్లా మల్లాపుర్ గ్రామంలో శనివారం ఈ అమానుష ఘటన జరిగింది. చంద్రరామ్ అనే వ్యక్తి తరుచూ మహిళలను అమ్మకానికి పెడుతుంటాడని పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో తన కోడలినే కొందరు వ్యక్తులకు అమ్మేశాడు. ఇందుకోసం గుజరాత్‌కు చెందిన పలువురితో రూ.80వేలకు బేరం కుదుర్చుకున్నాడు. కొడుకు లేని సమయంలో డబ్బులు తీసుకుని యువతిని అప్పగించేశాడు.
ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాధితురాలితో సహా రైల్వేస్టేషన్‌లో తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న పలువురు నిందితులను అరెస్టు చేశారు. వారి చెర నుంచి బాధితురాలిని విడిపించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, అరెస్టు చేసిన 8 మంది నిందితులలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, బాధితురాలి మామ చంద్రరామ్ సహా మరో నిందితుడు రాము గౌతమ్‌ల కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు.
వస్తువులను కొనుగోలు చేసి అమ్మినట్లు ప్రధాన నిందితుడు చంద్రరామ్ మహిళలతో వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు 300 మంది మహిళలను కొనుగోలు చేసి వారిని వివిధ వ్యక్తులకు విక్రయించినట్లు సమాచారం. ఓ హత్యకేసులో కూడా చంద్రరామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
Read Also….. Covid-19: గునుపూర్ జైలులో కరోనా కలకలం.. 70 మంది ఖైదీలు, ఐదుగురు సిబ్బందికి పాజిటివ్..