తగ్గేదే లే అంటున్న ఆహా… మరో ఇంట్రస్టింగ్ మూవీతో రానున్న తెలుగు ఓటీటీ ఫ్లాట్ఫామ్ ..
సరికొత్త కంటెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. రకరకాల వెబ్ సిరీస్ లతో కొత్తకొత్త సినిమాలతో.. ఆకట్టుకునే టాక్ షోలతో అలరిస్తుంది ఆహా.
సరికొత్త కంటెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. రకరకాల వెబ్ సిరీస్ లతో కొత్తకొత్త సినిమాలతో.. ఆకట్టుకునే టాక్ షోలతో అలరిస్తుంది ఆహా. ఇప్పటికే ఆహా వేదికగా అనేక సినిమాలు సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే త్వరలో మరో సినిమా కూడా రానుంది. వరుసగా ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ షో ఇలా ఏదో ఒక ప్రాజెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం తో ఆహా ప్రేక్షకాదరణ పొందుతుంది. కేవలం తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషల్లో మంచి విజయాలను అందుకున్న సినిమాలను కూడా తెలుగులోకి అనువదించి అందిస్తుంది ఆహా.
ఈ క్రమంలో ఇప్పటికే పలు తమిళ్ మలయాళ సినిమాలు ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా కన్నడ లో సూపర్ హిట్ అయినా ఓ సినిమా కూడా త్వరలో ఆహా లో స్ట్రీమింగ్ అవ్వనుంది. కన్నడంలో రూపొందిన హీరో అనే సినిమా ఈ ఏడాది మార్చి లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ గానే కాకుండా కామెడీతో కూడా ఆకట్టుకున్న ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయనున్నారు. కన్నడ హీరోను డబ్ చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఆహా వారు ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ ను కూడా విడుదల చేయడం తో ప్రేక్షకులకు మరో మంచి కంటెంట్ మూవీ మరియు కామెడీ మూవీ పడ్డట్లే అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :