Satyabhama OTT: ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. సత్యభామ ఎక్కడ చూడొచ్చంటే..

క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ అదరగొట్టేసింది. ఈ మూవీ కాజల్ నటనకు ఎప్పటికీ విమర్శకుల ప్రశంసలు వచ్చినా జనాలు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. ఫలితంగా థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకుంది.

Satyabhama OTT: ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. సత్యభామ ఎక్కడ చూడొచ్చంటే..
Kajal Sathyabhama
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 28, 2024 | 9:58 AM

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. చందమామ సినిమాతో తెలుగు కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది. గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. చేతి నిండా సినిమాలతో కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది కాజల్. ఇటీవల లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ అదరగొట్టేసింది. ఈ మూవీ కాజల్ నటనకు ఎప్పటికీ విమర్శకుల ప్రశంసలు వచ్చినా జనాలు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. ఫలితంగా థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకుంది.

ఇక థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించిన ఈ సినిమా ఆశించిన స్తాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు వచ్చింది. ఎలాంటి ప్రకటన హడావిడి లేకుండానే సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. సత్యభామ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవతుుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఇంట్లోనే చూసేయ్యోచ్చు.

కాజల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఆరమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ టిక్కా నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా.. ఇందులో ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్దన్, రవి వర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ ఎడ్మ కీలకపాత్రలు పోషించారు. కథ విషయానికి వస్తే.. షీ టీంలో ఏసీపీగా పనిచేసే సత్యభామ (కాజల్)కు ఓ మిస్టరీ కేసు ఎదురవుతుంది. హసీనా అనే యువతిని ఆమె భర్త యాదు దారణంగా హత్య చేస్తాడు. ఆ మర్డర్ తర్వాత హసీనా భర్త యాదుతోపాటు ఆమె తమ్ముడు ఇక్బాల్ కూడా కనిపించకుండా పోతారు. వారిని పట్టుకోవడంతోపాటు హసీనా తమ్ముడు ఇక్బాల్ మిస్సింగ్ వెనకున్న మిస్టరీని ఛేదించే సమయంలో సత్యభామకు ఎలాంటి నిజాలు తెలిశాయి అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.