Agnisakshi: మిస్టీరియస్ మర్డర్ కేసుతో సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అగ్నిసాక్షి ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే..
ఇక ఇప్పుడు మరో కొత్తగా మర్డర్ మిస్టరీతో మరో తెలుగు వెబ్ సిరీస్ అగ్నిసాక్షి రాబోతుంది. బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు అంబటి అర్జున్ ఇందులో హీరోగా నటిస్తుండగా.. ఐశ్వర్య లీడ్ రోల్ పోషిస్తుంది. అగ్నిసాక్షి వెబ్ సిరీస్ చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసినా.. ఇటీవలే ఈ సిరీస్ లోని క్యారెక్టర్స్ రివీల్ చేశారు. ఈ సిరీస్ ను జూలై 12 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఎక్కువగా హరర్ కామెడీ, సస్పెన్స్ థ్రిల్లింగ్ కంటెంట్ చూసేందుకు సినీ ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు. సూపర్ హిట్ సినిమాలతోపాటు అటు కొత్తగా వచ్చే వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో యక్షిణి అనే హారర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మంచు లక్ష్మి, వేదిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు మరో కొత్తగా మర్డర్ మిస్టరీతో మరో తెలుగు వెబ్ సిరీస్ అగ్నిసాక్షి రాబోతుంది. బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు అంబటి అర్జున్ ఇందులో హీరోగా నటిస్తుండగా.. ఐశ్వర్య లీడ్ రోల్ పోషిస్తుంది. అగ్నిసాక్షి వెబ్ సిరీస్ చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేసినా.. ఇటీవలే ఈ సిరీస్ లోని క్యారెక్టర్స్ రివీల్ చేశారు. ఈ సిరీస్ ను జూలై 12 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు
ఈ సిరీస్ లాంగ్ ఫార్మాట్ షోగా రానుంది. అంటే ఇందులో చాలా ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తోపాటు అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో ఈ సిరీస్ ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సిరీస్ డైరెక్టర్.. ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. కానీ అర్జున్, ఐశ్వర్య జోడికి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరు గతంలో బుల్లితరెపై పలు సీరియల్స్ చేశారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా అర్జున్ అంబటి మరింత పాపులర్ అయ్యారు.
అగ్నిసాక్షి స్టోరీ.. పోలీస్ ఆఫీసర్ శంకర్ పాత్రలో అర్జున్ నటిస్తున్నాడు. అతడి లైఫ్ చుట్టూ ఈ సిరీస్ తిరగనుంది. అర్జున్ కుటుంబంలో ఒకరిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉండగా.. అతడికి గౌరి (ఐశ్వర్య) కలుగుతుంది. ఆ తర్వాత అతడి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయిన అమ్మాయి గౌరి.. వృత్తిని బాధ్యతగా భావించే పోలీస్ ఆఫీసర్ గా వీరిద్దరూ సీరియస్ రోల్స్ చేస్తున్నారు. కానీ వీరిద్దరి జీవితాల్లో ఓ మిస్టీరియస్ మర్డర్ కేసు అనుకోని పరిస్థితులను తీసుకువస్తుంది. సస్పెన్స్ ఎమోషన్స్, ట్విస్టులతో ఈ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సిరీస్ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.