AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mystery Thriller OTT: చిరుత హీరోయిన్ బోల్డ్ వెబ్ సిరీస్.. మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

తిరిగి బాలీవుడ్ షిఫ్ట్ అయినా నేహా శర్మ.. అక్కడే వరుస సినిమాలు చేస్తుంది. చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది నేహా.. కానీ ఈసారి సినిమా కాదు.. వెబ్ సిరీస్. ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యింది. నేహా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది.

Mystery Thriller OTT: చిరుత హీరోయిన్ బోల్డ్ వెబ్ సిరీస్.. మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
36 Days Web Series
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2024 | 6:43 AM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయమైన చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నేహా శర్మ. తొలి చిత్రంతోనే ఈ బ్యూటీకి భీభత్సమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఈ మూవీ తర్వాత వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు సినిమాతో మరోసారి అలరించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో నేహాకు అవకాశాలు అంతగా రాలేదు. దీంతో తిరిగి బాలీవుడ్ షిఫ్ట్ అయినా నేహా శర్మ.. అక్కడే వరుస సినిమాలు చేస్తుంది. చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది నేహా.. కానీ ఈసారి సినిమా కాదు.. వెబ్ సిరీస్. ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యింది. నేహా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది.

30 డేస్ అనే టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. జూలై 12 నుంచి ఈ సిరీస్ ఓటీటీలో సినీ ప్రియుల ముందుకు రాబోతుందని సోనీ లివ్ అఫీషియల్ గా ప్రకటించింది. 36 డేస్ కు సంబంధించిన అన్ని సీక్రెట్స్ ఆరోజు రివీల్ అవుతాయని వెల్లడించింది. ఇందులో నేహా శర్మతోపాటు పూరబ్ కోహ్లి, శ్రుతి సేఠ్, చందన్ రాయ్ సన్యాల్, షరీబ్ హష్మి, అమృతా ఖాన్విల్కర్ కీలకపాత్రలో నటించగా.. హాలీవుడ్ విమర్శలు అందుకున్న బోల్డ్ వెబ్ సిరీస్ 36 డేస్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. దీనికి డైరెక్టర్ విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహించారు.

మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్ నలభై నిమిషాల నుంచి యాభై నిమిషాల నిడివితో ఉంటాయని తెలుస్తోంది. అలాగే హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాలం, బెంగాళీ భాషలతోపాటు మరిన్ని భాషల్లో ఈసిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఇటీవల విడుదలైన 36 డేస్ ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో మరోసారి నేహా శర్మ అందాల ఆరబోత, గ్లామర్ లుక్స్ లో మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?