AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shalini Pandey: హీరోతో రొమాంటిక్ సీన్స్.. భయంతో పరుగులు పెట్టిన అర్జున్ రెడ్డి హీరోయిన్..

సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షాలినితోపాటు అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 21న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. తాజాగా బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది హీరోయిన్ షాలిని పాండే.

Shalini Pandey: హీరోతో రొమాంటిక్ సీన్స్.. భయంతో పరుగులు పెట్టిన అర్జున్ రెడ్డి హీరోయిన్..
Shalini Pandey
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2024 | 7:09 AM

Share

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది షాలిని పాండే. అందం, అమాయకత్వం, సొట్టబుగ్గలతో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది. ఫస్ట్ మూవీతోనే సెన్సెషన్ హిట్ అందుకున్న షాలిని.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్‏గా, మరికొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించింది. మహానటి, ఇద్దరి లోకం ఒకటే వంటి చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ బాలీవుడ్ లో వరుస మూవీస్ చేస్తుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న షాలిని.. తాజాగా మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సిద్ధార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షాలినితోపాటు అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 21న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. తాజాగా బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది హీరోయిన్ షాలిని పాండే.

ఈ సినిమాలో కిషోరి పాత్రలో కనిపించింది షాలిని. ఇందులో జైదీప్ అహ్లావత్‏తో రొమాంటిక్ సీన్ గురించి మాట్లాడింది. అలాంటి సీన్ చేస్తున్నప్పుడు ఆకస్మాత్తుగా తాను బయటకు వెళ్లానని తెలిపింది. ఆ సీన్ తనపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలియదని.. కానీ తనకు చీకటి గదిలో ఉండాలంటే భయమని చెప్పుకొచ్చింది. తనకు కాస్త సమయం కావాలని.. ప్రశాంతమైన వాతావరణం కావాలని దర్శకుడిని అడిగానని.. దీంతో వారు తన పరిస్థితిని అర్థం చేసుకున్నారని తెలిపింది. మొదట్లో స్క్రిప్ట్ చదివినప్పుడు కిషోరి పాత్ర చాలా తెలివి తక్కువ అమ్మాయి అనుకున్నానని.. ఆమె చేసే ప్రతి విషయాన్ని కచ్చితంగా నమ్ముతుందని చెప్పుకొచ్చింది.

జైదీప్ అహ్లావత్ సేవ అనే ముసుగులో కొందరు నాయకులతో కలిసి ప్రజలను మోసం చేస్తుంటారు. ఇందులో అతడు స్త్రీలపై అత్యాచారం చేసే పాత్రలో కనిపిస్తాడు. 1800 కాలంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించగా.. జునైద్ కోర్టులో మహారాజ్ దోపిడీలపై పోరాడే రచయితగా నటించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్