OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDB 7.1 రేటింగ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన తాజా సినిమా 'భజే వాయు వేగం'. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఐశ్వర్య మేనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే చాలా రోజుల తర్వాత హ్యాపీ డేస్ ఫేం రాహుల్ టైసన్ ఒక కీలక పాత్రలో నటించాడు.
యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన తాజా సినిమా ‘భజే వాయు వేగం’. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఐశ్వర్య మేనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే చాలా రోజుల తర్వాత హ్యాపీ డేస్ ఫేం రాహుల్ టైసన్ ఒక కీలక పాత్రలో నటించాడు. మే 31న థియేటర్లలో రిలీజైన భజే వాయు వేగం డీసెంట్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో ఆడియెన్స్ నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాలన్నింటికి రేటింగ్స్ ఇచ్చే ఐఎమ్‌డీబీ భజే వాయు వేగం మూవీకి 10కి ఏకంగా 7.1 రేటింగ్ ఇచ్చింది. ఇలా ఎన్నో విశేషాలున్న ఈ సూపర్ హిట్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ భజే వాయు వేగం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో శుక్రవారం (జూన్ 28) నుంచే ఈ సూపర్ హిట్ సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొచ్చారు. థియేటర్స్‌లో మంచి విజయం అందుకున్నభజే వాయు వేగం నెట్ ఫ్లిక్స్‌లోనూ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మించిన భజే వాయు వేగం సినిమాలో నికెళ్ల భరణి, శరత్ లోహితస్వ, రవిశంకర్, సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రదన్ ఈ సినిమాకు స్వరాలు అందించగా.. కపిల్ కుమార్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. భజే వాయు వేగం సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూస్తున్న ప్రేక్షకులు సినిమాలో తమకు నచ్చిన సన్నివేశాల స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరి మీరు థియేటర్లలో భజే వాయు వేగం సినిమాను మిస్ అయ్యారా? లేక మళ్లీ ఈ సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా ఇంట్లోనే నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూసేయండి మరి. వీకెండ్ లో ఫ్యామిలితో కలిసి చూసేందుకు భజే వాయు వేగం సినిమా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
From chasing dreams to chasing shadows, Venkat is in a race against time. ⌛ Watch Bhaje Vaayu Vegam now on Netflix! pic.twitter.com/y5plIrmz3W
— Netflix India South (@Netflix_INSouth) June 28, 2024
We’ve arrived on your screens, it’s time for you to sit back & feel the rush of emotions on @NetflixIndia today ❤️🤩#BhajeVaayuVegam streaming now!! pic.twitter.com/MJPVGULMdW
— Kartikeya (@ActorKartikeya) June 28, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.