AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raimohan Parida: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఫేమస్ నటుడు..

ప్రముఖ ఒడియ నటుడు రాయ్ మోహన్ ఫరిదా తన గదిలో ఉరివేసుకుని మృతి చెందారు.. 58ఏళ్ల ఫరిదాకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Raimohan Parida: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఫేమస్ నటుడు..
Raimohan Parida
Rajitha Chanti
|

Updated on: Jun 25, 2022 | 10:18 AM

Share

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది.. శుక్రవారం ప్రముఖ మలయాళ నటుడు వీపీ ఖలీద్ మరణించిన వార్త మరువక ముందే మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.. ప్రముఖ ఒడియ నటుడు రాయ్ మోహన్ ఫరిదా తన గదిలో ఉరివేసుకుని మృతి చెందారు.. 58ఏళ్ల ఫరిదాకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భువనేశ్వర్‏లోని ప్రాచీ విహార్ ప్రాంతంలోని తన నివాసంలో శనివారం ఉదయం తన గదిలోని సీలింగ్‏కు ఉరివేసుకున్నారు. గమనించిన కుటుంబసభ్యులు హుటహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఫరిదా ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమిక నిర్దారణకు వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తలరించనున్నట్లు తెలిపారు. ఫరిదా మరణవార్త తెలుసుకున్ని సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు…

ఫరిదా నెగిటివ్ పాత్రలతో గుర్తింపు పొందారు.. దాదాపు 100కు పైగా ఒడియా చిత్రాల్లో.. 15 బెంగాలీ సినిమాల్లో నటించి మెప్పించారు.. కియోంజర్ జిల్లాకు చెందిన ఫరిదా రామ్ లక్మణ్, ఆసిబు కేబే సాజీ మో రాణి’, ‘నాగ పంచమి’, ‘ఉదండి సీత’, ‘తు తిలే మో దారా కహకు’, ‘రాణా భూమి’ వంటి పలు సూపర్‌హిట్ సినిమాల్లో నటించారు.. తన నటనతో ఫరిదా ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతారని.. ఆయన ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానంటూ ఒడిశా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.