AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh: అప్పుడు ప్రామిస్ చేశాను.. ఇప్పుడు నిలబెట్టుకున్నాను.. ఆసక్తికర ట్వీట్ చేసిన అడివి శేష్..

తాజాగా మేజర్ సినిమా విజయవంతంగా నాల్గవ వారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో అడివి శేష్ సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేశారు...

Adivi Sesh: అప్పుడు ప్రామిస్ చేశాను.. ఇప్పుడు నిలబెట్టుకున్నాను.. ఆసక్తికర ట్వీట్ చేసిన అడివి శేష్..
Adivi Sesh
Rajitha Chanti
|

Updated on: Jun 25, 2022 | 11:39 AM

Share

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రస్తుతం మేజర్ (Major) సినిమా హిట్‏ను ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. జూన్ 3న విడుదలైన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో ప్రాణ త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్ల వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇందులో అడివి శేష్ మేజర్ సందీప్ పాత్రలో ఒదిగిపోయాడని.. ప్రతి ప్రేక్షకుడి చేత కన్నీళ్లు తెప్పించేలా సినిమా రూపొందించడంలో డైరెక్టర్ శశికిరణ్ సక్సెస్ అయ్యారంటూ ప్రశంసలు కురిపించారు..

తాజాగా మేజర్ సినిమా విజయవంతంగా నాల్గవ వారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో అడివి శేష్ సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేశారు… కరోనా సంక్షోభంలో ఒక మాట ఇచ్చాను.. మేజర్ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువస్తానని.. ఇప్పుడు నా మాట నిలబెట్టుకున్నాను.. మేజర్ సినిమా నాల్గవ వారం థియేటర్లలో సందడి చేస్తుంది.. అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా సాయి ముంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, శోభితా ధూళిపాళ్ల, మురళి శర్మ, అనీష్ తదితరులు కీలకపాత్రలలో నటించగా.. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన సంగీతం అందించారు..

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
స్టాక్ మార్కెట్ vs రియల్ ఎస్టేట్.. ఎందులో పెట్టుబడి పెట్టాలి?
స్టాక్ మార్కెట్ vs రియల్ ఎస్టేట్.. ఎందులో పెట్టుబడి పెట్టాలి?
అప్పుడు నాని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్‌గా..!
అప్పుడు నాని సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్‌గా..!
బాలీవుడ్‌లో తనపై తీవ్ర వివక్ష !! కుండబద్దలుకొట్టిన రెజీనా
బాలీవుడ్‌లో తనపై తీవ్ర వివక్ష !! కుండబద్దలుకొట్టిన రెజీనా
పెళ్లి కలవచ్చేసింది.. రెండు నెలల్లో 12 శుభ ముహూర్తాలు..
పెళ్లి కలవచ్చేసింది.. రెండు నెలల్లో 12 శుభ ముహూర్తాలు..
రాత్రి పడుకునే ముందు పాదాలు కడగకపోతే ఏమవుతుంది..?
రాత్రి పడుకునే ముందు పాదాలు కడగకపోతే ఏమవుతుంది..?
శని, గురువుల అనుకూలత.. ఆ రాశుల వారికి సంపద పెరిగే ఛాన్స్..!
శని, గురువుల అనుకూలత.. ఆ రాశుల వారికి సంపద పెరిగే ఛాన్స్..!
ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చి.. సర్‌ప్రైజ్‌ చేసిన కంపెనీ
ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చి.. సర్‌ప్రైజ్‌ చేసిన కంపెనీ
స్టార్ క్రికెటర్ ఎఫైర్.. చివరకు సన్యాసిలా మారి ఇలా..
స్టార్ క్రికెటర్ ఎఫైర్.. చివరకు సన్యాసిలా మారి ఇలా..
చురుకైన మిథున రాశి.. ఈ రాశులతో జత కడితే బెస్ట్ కపుల్ మీరే..!
చురుకైన మిథున రాశి.. ఈ రాశులతో జత కడితే బెస్ట్ కపుల్ మీరే..!
నాగేశ్వరరావుకు డూప్‌గా నటించింది ఎవరో తెలిస్తే స్టన్
నాగేశ్వరరావుకు డూప్‌గా నటించింది ఎవరో తెలిస్తే స్టన్