AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగు రోజుల్లోనే షూటింగ్.. అవార్డుల పంట పండించిన తెలుగు ఇండిపెండెంట్ సినిమా.. ఆహాలో ఓటీటీ విడుదలకు సిద్ధం

చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన సినిమాలు చాలానే ఉన్నాయి. కథను నమ్ముకొని హిట్ అందుకున్న సినిమాలు ఓటీటీల్లోనూ అదరగొడుతున్నాయి. ఇక ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు సంజీవ్.

నాలుగు రోజుల్లోనే షూటింగ్.. అవార్డుల పంట పండించిన తెలుగు ఇండిపెండెంట్ సినిమా.. ఆహాలో ఓటీటీ విడుదలకు సిద్ధం
Sanjeev
Rajeev Rayala
|

Updated on: Aug 08, 2026 | 8:19 AM

Share

కథకు ప్రాధాన్యతనిస్తూ స్వతంత్రంగా తెరకెక్కిన తెలుగు డ్రామా చిత్రం సంజీవ్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పలు జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, ఇప్పటికే ఏడు అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సంజీవ్ ఓటీటీ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఆవిష్కరించనున్నారు. దీంతో ఈ చిత్రం ఓటీటీ ప్రయాణానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది. వీబీ సినిమా బ్యానర్పై అనిల్ నక్క రచించి, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించిన ఈ చిత్రం పరిమిత బడ్జెట్లో స్వతంత్రంగా రూపొందింది. పెద్ద నిర్మాణ సంస్థల అండ లేకపోయినా.. బలమైన కథ, సహజమైన కథనం, నటీనటుల ప్రతిభతో ప్రేక్షకులను, ఫిల్మ్ ఫెస్టివల్స్ను ఆకట్టుకుంది.

‘సంజీవ్’ చిత్రం సుమారు 70 నిమిషాల నిడివితో తెరకెక్కింది. తెలుగు భాషలో రూపొందిన ఈ చిత్రానికి కూర్పు సాయి కృష్ణ నరేడ్ల చేయగ. భూపతి కేవై సినిమాటోగ్రఫీ అందించారు, జాన్ కే జోసెఫ్ సంగీతాన్ని సమకూర్చారు పాటలు రచన శివ శంకర్ చింతకింది అలాగే వీర మనోహర్ కావాలి అందించారు. ఈ సినిమా నిర్మాణ ప్రయాణంలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘సంజీవ్’ చిత్రాన్ని కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి చేశారు. పరిమిత వనరులు, తక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ.. కథపై నమ్మకంతో, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ చిత్రాన్ని పూర్తి చేశారు.

థియేటర్, షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ నేపథ్యంతో వచ్చిన పలువురు యువకులు ఈ సినిమా కోసం కలిసి పనిచేశారు. తమ సొంత సినిమాను రూపొందించాలనే లక్ష్యంతో ఏర్పడిన టీమ్ APPAHకు ‘సంజీవ్’ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్గా నిలిచింది. ఈ చిత్రంలో వీర మనోహర్, హరీష్ పాలకుర్తి, అచ్యుత్, లయ మిరియాల నటులుగా అనిల్ నక్క తో పాటు కీలక పాత్రలో పోషించారు. థియేటర్ నుంచి సినిమా వైపు వచ్చిన యువ ప్రతిభకు సంజీవ్ ఒక ముఖ్యమైన ప్రయాణంగా నిలిచింది. ఫిల్మ్ ఫెస్టివల్స్లో మంచి గుర్తింపు పొందిన అనంతరం ఇప్పుడు ‘సంజీవ్’ ఆహా ద్వారా మరింత విస్తృతమైన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక చిన్న బడ్జెట్ ఇండిపెండెంట్ సినిమా.. ఫెస్టివల్ సర్క్యూట్ నుంచి ఓటీటీ వరకు ప్రయాణించడం చిత్ర బృందానికి ప్రత్యేకమైన విజయంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ఓటీటీ విడుదల ప్రకటన ఆవిష్కరణ కావడం ‘సంజీవ్’ చిత్ర బృందానికి మరో ప్రత్యేకమైన మైలురాయిగా నిలవనుంది.

View this post on Instagram

A post shared by Anil Nakka (@anilnakka)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us